తెలుగులో అప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడమే కాదు జనాలను కంటతడి పెట్టించి ఇప్పటికి అదే ఆసక్తిని కనబరిచేలా చేస్తున్న కొన్ని సినిమాలు ఉన్నాయి.అందులో జగపతి బాబు హీరో గా వచ్చిన శుభాకాంక్షలు అయితే జనాలు అసలు మర్చిపోయే అవకాశం ఉండదు. ఆ సినిమా ఎప్పుడు టీవీ లో వచ్చినా సరే కచ్చితంగా సినిమాను చూస్తూ ఉంటారు. ఆ సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా జనాలకు చాలా బాగా నచ్చింది అనే చెప్పాలి. ఆ సినిమాలో జగపతి బాబు నటన తో పాటుగా హీరో యిన్ గా చేసిన రాశి నటన అన్నీ కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఇక ఆమె నటన ఈ సినిమాలో హైలెట్ అయింది అని చెప్పాలి. చివరిలో వచ్చిన రవళి నటన కూడా సినిమాకు హైలెట్ అయింది. 

 

 

ఇక ఈ సినిమాలో జగపతి బాబు తన ప్రేమను చెప్పే లోపు రాశి తన ప్రేమ గురించి చెప్తుంది.తానూ ప్రేమించిన ప్రియురాలి ప్రేమించడానికి హీరో పడే తపన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఆ తరుణంలో ఏవీయస్ గారి నటన అద్భుతం.  ఆ సీన్ లు బాగానే నచ్చాయి జనాలకు. చివరికి తన ప్రియురాలి ప్రేమను గెలిపించి తానూ వెళ్లిపోతాడు. అది నిజమైన ప్రేమ అని జనాలు జేజేలు పలికారు. 
 

 

అలా ఆ సినిమా ప్రేక్షకులకు బాగా గుర్తు ఉంది అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ చాలా సినిమాలు చేశారు. జగపతి బాబు నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ జనాలను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి.ఈ  సినిమాలో నటించిన ఇతర నటులు కూడా బాగానే ఆకట్టుకున్నారు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: