నందమూరి బాలకృష్ణ మొదటి నుంచి ఏ పని చేసిన అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు అదే ఓ అరుదైన రికార్డు వెళ్లేలా చేసింది. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒకే సమయంలో 21 వేల కేకులను కట్​ చేశారు అభిమానులు. ఈ వేడుకను పర్యవేక్షించిన గిన్నీస్​ బుక్​ ఆఫ్ వరల్డ్​​ రికార్డ్స్​ ప్రతినిధులు, అరుదైన రికార్డుగా దీనిని నమోదు చేశారు. సంబంధిత పత్రాలను హీరో బాలకృష్ణకు త్వరలో అందజేయనున్నారు.

 

 

నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు గిన్నీస్ రికార్డు సృష్టించాయి. జూన్ 10న ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా, అభిమానులు ఒకే సమయంలో 21 వేల కేకులు కట్​ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా, తన పుట్టినరోజు వేడుకలను ఈ ఏడాది నిరాడంబరంగా జరపాలని బాలయ్య నిర్ణయించారు. అదే విషయాన్ని అభిమానులకు సూచించి, వైరస్ నియంత్రణకు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఆయన మాటకు విలువనిచ్చిన నందమూరి ఫ్యాన్స్.. ఇంటికే పరిమితమై, ఆరాధ్య కథానాయకుడి జన్మదిన వేడుకలను రికార్డు స్థాయిలో నిర్వహించారు.

 

 

జూన్​ 10న ఒకే సమయంలో (ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లు) 21 వేల కేక్​లను బాలకృష్ణ అభిమానులు కట్​ చేశారు. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించగా.. దాదాపు 80 వేల మంది ఇందులో భాగమయ్యారు. ​ఈ వేడుకను వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, గిన్నీస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ ప్రతినిధులు పర్యవేక్షించి ప్రపంచ రికార్డుగా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత.. సంబంధిత పత్రాలను బాలకృష్ణకు స్వయంగా అందజేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ రికార్డుకు కారణమైన NBK హెల్పింగ్​ హ్యాండ్స్​ ప్రతినిధి అనంతపురం జగన్ ​కు హీరో బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. అభిమానులు వారి కుటుంబసభ్యులతో తన పుట్టినరోజు వేడుకలను జరిపి వారికున్న సామాజిక బాధ్యతను నిర్వర్తించుకోవడం సహా తనకు అపూర్వ కానుకను ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: