సాధారణంగా సెలబ్రెటీలకు సంబంధించిన భద్రత ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా తెలిసిందే.  రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాల్లో దిగ్గజాలకు సెక్యూరిటీ బాగా ఉంటుంది. వారికి ఎంలాంటి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించి చర్యలు పూనుకుంటారు.  అలాంటిది భారతీయ చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట్లో బాంబ్ పెట్టినట్టు వార్త వచ్చింది. చెన్నై పోయిస్‌ గార్డెన్‌ ప్రాంతంలోని రజినీకాంత్‌ ఇంట్లో బాంబు పెట్టారని , 108 నంబర్‌కు ఓ అజ్ఞాత ఫోన్‌కాల్‌ వచ్చింది. కంట్రోల్‌ రూం ద్వారా అప్రమత్తమైన పోలీసులు.. బాంబు నిర్వీర్య దళంతో కలిసి రజినీకాంత్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. 

 

ఇంకేముంది సోషల్ మీడియాలో భారగా వైరల్ అయ్యింది.. అసలే కరోనా కాలంలో నానా కష్టాలు పడుతుంటే ఈ ఉపద్రవం ఏంట్రా నాయనా అనుకున్నారు.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి ఆవరణతోపాటు పరిసరాలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు ఏవి కనిపించకపోవడంతో.. నకిలీ కాల్‌గా తేల్చారు. ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంసై సీరియస్ గా ఆరా తీశారు. కడలూర్ జిల్లా దగ్గర్లోని నెల్లికుప్పంకు చెందిన ఎనిమిదో తరగతి స్టూడెంట్ ఈ పని చేసినట్లు గుర్తించారు.

 

పోలీసు విచార‌ణ‌లో  అత‌ని మెడిక‌ల్ స్టేట్‌మెంట్స్ ప‌రిశీలించి ఈ బాలుడు మానసిక స్థితి సరిగా లేదని భావించి వదిలిపెట్టారు. మొత్తానికి 13 ఏళ్ళ ఆక‌తాయి చేసిన ప‌నికి అంద‌రు ఉలిక్కిప‌డ్డారు.  ఇలాంటి ఫేక్   కాల్స్ వల్ల ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: