ఘట్టమనేని కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు జన్మించిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాల్లో తన సత్తా చాటుతున్నాడు. అప్పట్లో సూపర్ కృష్ణ తెలుగు పరిశ్రమలో సంచలనం సృష్టిస్తే... అతడి వారసత్వమైన మహేష్ బాబు ఈ తరంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు అంటే అతిశయోక్తి కాదు. పోకిరి, దూకుడు వంటి సినిమాలను తీసి తెలుగు ఇండస్ట్రీలో అనేకమైన సినీ రికార్డు బద్దలు కొట్టిన క్రెడిట్ ఒక్క మహేష్ బాబుకే దక్కుతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. తన తండ్రి తెలుగు పరిశ్రమలో ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ... మహేష్ బాబు కేవలం తన నటనా చాతుర్యంతోనే అత్యంత పాపులారిటీ సంపాదించుకున్నాడు. 

IHG
నిజానికి కృష్ణకు తన కుమారుడు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. యుక్త వయస్సు వచ్చిన తర్వాత మహేష్ బాబు ఎక్కువగా తన తండ్రితోనే సమయం గడిపేవాడు. వీళ్ళిద్దరూ కలిసి 9 సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే మహేష్ బాబు తన తండ్రి వద్ద నటన కు సంబంధించిన ఎన్నో మెళకువలను నేర్చుకున్నాడు. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన శంఖారావం సినిమాలో కూడా మహేష్ బాబు నటించాడు. టక్కరి దొంగ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తే అతిథి పాత్రలో కృష్ణ కనిపించి ప్రేక్షకులను బాగా అలరించారు. 

IHG
సినిమా తర్వాత వీళ్లిద్దరు మళ్లీ కలసి నటించలేదు కానీ మహేష్ బాబు తదుపరి సినిమాలలో ఏదో ఒక రకంగా కృష్ణ కనిపిస్తారని తెలుస్తుంది. ఏది ఏమైనా సూపర్ స్టార్ కృష్ణకు తన కుమారుడు మహేష్ బాబు అంటే మిక్కిలి ఇష్టం అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాగే కృష్ణ అంటే కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకు బాగా ఇష్టం. తనకి అవార్డులు వచ్చిన ప్రతిసారి తన తండ్రి గురించి చెప్పకుండా స్టేజి దిగడు మహేష్ బాబు. దీన్ని బట్టి తన తండ్రి అంటే తనకు ఎంత ఇష్టమో, గౌరవమో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: