సినిమాల్లో హీరోయిన్లు క్లిక్ అయితే లాంగ్ కెరీర్ ఉంటుంది. దీంతో వారు దాదాపు పదేళ్లకు పైగానే సినిమాల్లో రాణిస్తూ ఉంటారు. కొందరు హీరోయిన్లు కొన్నేళ్లు సినిమాలు చేసాక పెళ్లి చేసుకుని జీవితంలో స్థిర పడతారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ సోనాలీ బింద్రే మొదటి క్యాటగిరీకి చెందుతుంది. హిందీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది సొనాలీ. దిల్ జలే, సర్ఫరోష్, హమ్ సాథ్ సాథ్ హై, కల్ హో నహో వంటి సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో కూడా సొనాలీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించింది.

IHG

 

తెలుగులో చిరంజీవితో ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, నాగార్జునతో మన్మథుడు, మహేశ్ తో మురారి, శ్రీకాంత్ తో ఖడ్గం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. బాలకృష్ణతో చేసిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా అంచనాకు తగ్గట్టుగా ఆడలేదు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగించిన సొనాలీ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. హిందీలో బస్ ఇత్నా సా క్వాబ్ హై, ద్రోణ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గోల్డీ బెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే నారాజ్ సినిమా సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2002లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

IHG'pillar of strength ...

 

తెలుగులో చిరంజీవితో శంకర్ దాదా, నాగార్జునతో మన్మధుడు, బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడు.. సినిమాలు సొనాలి పెళ్లి తర్వాత చేసిన సినిమాలే కావడం విశేషం. వీరిద్దరికీ రణవీర్ బెల్ అనే కుమారుడు ఉన్నాడు. కెరీర్లో మంచి స్టార్ స్టేటస్ చూసింది సొనాలి బింద్రే. వైవాహిక జీవితంలోనూ సక్సెస్ అయింది. అయితే.. సొనాలికి 2018లో క్యాన్సర్ సోకడం విచారించదగ్గ విషయం. యూఎస్ లో ట్రీట్మెంట్ తీసుకుని ప్రస్తుతం కోలుకుంటోంది. 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: