మూడు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో స్టార్ హీరోలు అంతా తమ ఇళ్ళకు పరిమితమై తమ భార్య పిల్లలతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.   ఇప్పటికే మహేష్ బాబు అల్లు అర్జున్ లు వారి పిల్లలతో గడుపుతున్న  విషయాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.


ఇలాంటి పరిస్థితులలో జూనియర్ ఎన్టీఆర్ కూడ ప్రస్తుతం తన ఇద్దరు కొడుకులతో ఎక్కువ సమయం కాలం గడపడమే కాకుండా తన ఇద్దరు పిల్లలకు కూడా టీచర్ గా మారిపోయి తెలుగు పాఠాలతో పాటు పలు విషయాలను నేర్పిస్తూ బిజీగా ఉన్నాడట. తన తాత నందమూరి తారక రామారావు సినిమాలను తన కొడుకులతో కలిసి చూస్తూ వారికి సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరించడమే కాకుండా తన పిల్లలకు తెలుగు పై ఇష్టం కలిగించేలా ప్రయత్నాలు చేస్తున్నాడట.  


అంతేకాదు తెలుగు భాషలోని కొన్ని పదాలను రోజుకు కొన్నికొన్ని చొప్పున తన పిల్లకు నేర్పిస్తూ తన పిల్లలకు తానే టీచర్ గా మారిపోయిన జూనియర్ ఒపికను చూసిన సన్నిహితులు తారక్ తలుచుకుంటే మంచి టీచర్ గా కూడ మారగలడు అని కామెంట్స్ చేస్తున్నారట. ప్రస్తుతం జూనియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తూ రెండు సంవత్సరాల కాలం వృథా కావడంతో వచ్చే ఏడాది జూనియర్ ఒకేసారి రెండు సినిమాలలో నటించి ఆ లోటును కవర్ చేయాలని భావిస్తున్నట్లు టాక్.  

 

ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాను ఓకే చేసిన జూనియర్ ‘కే జీ ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడ సినిమా చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించాడు అని వార్తలు వస్తున్నాయి. తెలుగు భాషకు జాతీయంగా ఒక గౌరవం గుర్తింపు తీసుకువచ్చిన తన తాత ఎన్టీఆర్ స్ఫూర్తి తన పిల్లలకు కలిగే విధంగా జూనియర్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టి తనకు తెలుగు భాష పై ఉన్న మక్కువను మరొకసారి చాటుకున్నాడు అని అనుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: