తన అంద చందాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది ఈ నటి. తన అమాయకపు మొహంతో అభిమానుల మనసు కొల్లగోట్టిందినటి మీనా. ఈమె నిన్నటి తరం హీరోయిన్స్ లో స్టార్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారో అందరికి తెలిసిన విషయమే. మీనా చిన్న, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా అందరితో నటించేది. 1982లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరమీద కనిపించిన మీనా అప్పటి నుండి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ నటించి మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె దాదాపుగా 45 సినిమాలలో నటించారు.

 

 

అక్కినేని నాగేశ్వరావు గారు నటించిన సీతారామయ్యగారి మనవరాలు చిత్రంతో తెలుగుకి ఎంట్రీ ఇచ్చిన మీనా ఆ మూవీలో తన నటనకు నంది అవార్డు కూడా అందుకుంది. ఇక అక్కడి నుండి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ ఇలా అన్ని లాంగ్వేజ్ లో కూడా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2009లో విద్యాసాగర్ తో మీనా వివాహం జరిగింది.

 

 


పెళ్లి తర్వాత కూడా ఆమె పలు సినిమాలలో నటించింది. మీనా, విద్యాసాగర్ గార్లకి ఒక పాప ఉంది. పాప పేరు నైనిక. ఒక వైపు అమ్మగా పాప బాధ్యతలు చూసుకుంటూ.. ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. తెలుగులో మామ మంచు అల్లుడు కంచు మీనా గారి ఆఖరి చిత్రం. కూతురు నైనికను కూడా తమిళ్ లో విజయ్, అట్లీ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ద్వారా బాలనటిగా ఇంట్రడ్యూస్ చేసింది.

 

 

నైనిక కూడా మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన మూవీ అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ ఫొటోస్ ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: