టాలీవుడ్ లో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే జనాలు చాలా ఆసక్తికరంగా చదువుతున్నారు. రోజు రోజు కి ఈ సినిమా మీద జనాలకు ఒక తెలియని క్రేజ్ అనేది వస్తుంది. సినిమా లేట్ అవుతున్న కొద్దీ కూడా సినిమా మీద జనాలకు ఒక తెలియని ఆసక్తి అయితే ఏర్పడింది అని చెప్పాలి. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు చాలా చర్చలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను విదేశాల్లో షూటింగ్ చేసే అవకాశం ఉంది అని పలువురు అంటున్నారు. 

 

ఈ సినిమాను విదేశాల్లో షూట్ చేయడానికి గానూ చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. ఈ సినిమాకు గానూ అనుమతి అడగాలి అని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాను విదేశాల్లో షూట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో ఇప్పుడు నటించే నటులు కూడా విదేశాల నుంచి రావాల్సి ఉంది. ఇక వారి విషయంలో కూడా ప్రభుత్వాన్ని అడగాలి అని దర్శకుడు భావిస్తున్నారు. హీరోయిన్ ఒకరు విదేశాల నుంచి రావాల్సి ఉంది. దీనితో ఆమె రావడానికి అనుమతి ఇస్తారా లేదా అనేది చర్చనీయంశంగా మారింది. 

 

ఆమె ఇప్పుడు అమెరికాలో ఉండటం అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ విషయానికి వస్తే కొమరం భీమ్ గా నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద ఏ స్పష్టత ఇప్పటి వరకు రాలేదు అనే చెప్పాలి. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: