సీనియర్ హీరోలకు ఇప్పుడు కరోనా భయం చాలానే ఉంది. సినిమాను షూట్ చెయ్యాలి అంటే చాలు భయపడుతున్నారు స్టార్ హీరోలు. మన తెలుగు లో నలుగురు హీరోల వయసు  ఇప్పుడు 60 దాటింది. దీని తో వారు అందరూ కూడా ఇప్పుడు సినిమాల షూటింగ్ కి వెళ్ళడం కంటే ఇంట్లో ఉండటమే మంచిది అనే భావన లో ఉన్నారు అనే ప్రచారం టాలీవుడ్ లో బాగానే  జరుగుతుంది. ఇక చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలకు ఇంట్లో తీవ్ర ఒత్తిడి ఉందని అంటున్నారు. దానికి కారణం వారి వయసు పైబడటమే. ఇద్దరూ కూడా ఇప్పుడు చెరో సినిమాలో నటిస్తున్నారు. 

 

ఈ రెండు సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈ రెండు సినిమాలను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చెప్పడం చాలా కష్టం అనేది వాస్తవం. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే అసలు చిరంజీవి ని షూటింగ్ కి వద్దు అని చెప్పారట రామ్ చరణ్. కొరటాల శివను మరో కథను ఈ ఖాళీ టైం లో రెడీ చేసుకోవాలని తన సినిమాకు కథ రాయాలి అని చెప్పారట. ఇక బాలయ్య  పరిస్థితి కూడా దాదాపుగా ఆదే విధంగా ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఆయనను అసలు ఇంట్లో వాళ్ళు షూటింగ్ కి వద్దు అని చెప్పారు అని బాలయ్య కూడా ఇప్పుడు వెనక్కు తగ్గి అసలు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు అని అవసరం అనుకుంటే మాత్రమే ఆయన బయటకు వస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే సీనియర్ హీరోలతో సినిమాలు చేయడం కూడా దర్శక నిర్మాతలకు పెద్ద తల నొప్పిగానే ఉంది అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: