భారీ సినిమాల షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయో ఎవరికీ క్లారిటీ లేకపోయినా ఇండస్ట్రీలోని వార్తలు మొత్తం ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘వకీల్ సాబ్’ ప్రభాస్ రాథా కృష్ణ’ ల మూవీల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రస్తుతం చైతన్య విహీనంగా మారి కళతప్పిన బాక్స్ ఆఫీస్ కు పూర్వవైభవం తీసుకువచ్చే శక్తి ఈ నాలుగు సినిమాలకే ఉందని ఇండస్ట్రీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ‘ఆచార్య’ కు సంబంధించి ఒక షాకింగ్ గాసిప్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ‘ఆచార్య’ షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టే విషయంలో ఈమధ్య చరణ్ కొరటాల ల మధ్య జరిగిన వ్యక్తిగత సమావేశంలో చరణ్ అనుకోకుండా అన్న ఒక కామెంట్ కొరటాలకు తీవ్ర మనస్తాపం కలిగించింది అంటూ గాసిప్పులు వస్తున్నాయి.


‘ఆచార్య’ కు తాను నిర్మాతగా కొనసాగుతున్నప్పటికీ తన మొదటి ప్రాధాన్యత మటుకు ‘ఆర్ ఆర్ ఆర్’ మాత్రమే అని ఆతరువాతే ‘ఆచార్య’ గురించి ఆలోచిస్తాను అని చరణ్ కొరటాల వద్ద కామెంట్ చేసాడు అని తెలుస్తోంది. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పూర్తి అయ్యే వరకు చరణ్ ‘ఆచార్య’ షూటింగ్ కు రాడు అన్నక్లారిటీ చరణ్ మాటలలో కొరటాలకు అర్థంకావడంతో ఈమూవీని ఫినిష్ చేయడానికి ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి అయ్యేవరకు ఎదురుచూస్తూ ఎంతకాలం వృథా చేయాలి అన్న అంతర్మధనం కొరటాలలో ప్రారంభం కావడంతో చరణ్ స్థానంలో మరో హీరోని పెట్టుకుంటే బాగుంటుంది అన్న తన అభిప్రాయాన్ని చిరంజీవికి తెలియచేసినట్లు టాక్.


ఈ అనుకోని విషయాలకు షాక్ అయిన చిరంజీవి ప్రస్తుతం కొరటాలతో మాట్లాడుతూ ఈ సున్నిత సమస్యకు తాను మార్గం వెతుకుతాను అని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొరటాలకు ఈమాటల పై పూర్తి నమ్మకం లేకపోయినా చిరంజీవి పెద్దరికం పై భారం వేసి టోటల్ కన్ఫ్యూజన్ లో ప్రస్తుతం కొరటాల ఉన్నాడు అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: