మురళి మోహన్ సినిమా పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మురళి మోహన్ జగమే మాయ, నేరము - శిక్ష, తిరుపతి, రాదమ్మ పెళ్ళి, దేవుడు చేసిన పెళ్ళి, వయసొచ్చిన పిల్ల, జేబు దొంగ, బలిపీఠం, భారతంలో ఒక అమ్మాయి, బాబు, జ్యోతి ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు మురళీ మోహన్. అయితే సినీ పరిశ్రమలో శోభన్ బాబుకు మురళి మోహన్ కి మంచి సంబంధమే ఉందండి. 

 

 

నటుడిగా మన అందరికీ తెలిసిన మురళీ మోహన్ ఓ రాజకీయ నాయకుడు కూడా. 1985 లో నటుడు మురళీ మొహన్ నంది అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఓ తండ్రి తీర్పు అనే సినిమాతో అవార్డుని దక్కించుకున్నాడు. ఇతను మంచి వ్యాపారి కూడ. ఈయిన నాటకాల నుండి సినిమాల్లోకి అడుగు పెట్టాడు. మొదట వ్యాపారం పెట్టిన మురళీ మోహన్ విజయవాడలో నాటకాలు చేస్తూ నెమ్మదిగా సినిమాల వైపు ప్రవేశం చేసాడు. తర్వాత సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. అనేక సినిమాల్లో ఈయిన పాత్ర చెప్పుకోదగ్గది.

 

 
అంతే కాదు.. శోభన్ బాబు ఈ సూత్రాన్ని తన సహనటులకూ చెబుతుండేవారు. అందుకు ఉదాహరణే.. మురళీ మోహన్.. శోభన్ బాబు పదే పదే చెప్పిన తర్వాతే తాను రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టానని మురళీ మోహన్ చెప్పేవారు. భూమిపై పెట్టిన పెట్టుబడి ఎక్కడికీ పోదని.. సంపాదించే సమయంలోనే భూములు కొనుక్కోవాలని శోభన్ బాబు చెప్పిన సూత్రాన్ని మురళీ మోహన్ ఆచరణలో పెట్టారు.

 

 

అందుకే మురళీ మోహన్ జయభేరి సంస్థ పేరుతో హైదరాబాద్ లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. వందల ఎకరాలు కొన్నారు. ఆ తర్వాత ఆయన కొన్న భూములకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. అలా శోభన్ బాబు తన సలహాలతో మురళీ మోహన్ జీవితాన్ని మార్చేశారనే చెప్పాలి. సినిమాల్లో నటించే ఈయిన రాజకీయాల్లో కూడ మంచి స్థానం దక్కించుకున్నాడు. ఇలా నటుడు మురళీ మోహన్ రాజకీయాలలో కూడా ప్రవేశించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: