టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి ఈ రోజు తన 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె సినీ జీవితం ఎలా ప్రారంభమైందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. విజయశాంతి తల్లికి ఇద్దరు చెల్లెళ్ళు ఉండగా వారిలో ఒకరు విజయలలిత కాగా ఆమె సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోయిన్ గా నటించే వారు. విజయశాంతి తండ్రికి సినిమాలపై చాలా మక్కువ ఉండటంతో తన కూతురిని సినిమా హీరోయిన్ చేయాలని అనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే తన మరదలు విజయలలిత సహాయంతో ఒక సినిమాలో విజయశాంతిని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటింప చేశారు కానీ ఆ సినిమాలో విజయశాంతి కేవలం కొద్ది సేపు మాత్రమే కనిపించడంతో ఆ సినిమా పేరేంటో ఎవరు వెల్లడించలేదు. 

IHG
విజయశాంతికి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి శ్రీనివాస్ ప్రసాద్ ఆమె ఫోటోలు తీసి ఒక ఆల్బమ్ తయారుచేసి సినిమా నిర్మాతలకు, డైరెక్టర్లకు చూపించేవారు. ఆ క్రమంలోనే డైరెక్టరు భారతీరాజా విజయశాంతి ఫోటో ఆల్బమ్ ని పరిశీలించి ఈమె కళ్ళల్లో ఏదో మెరుపు ఉందని చెప్పి తాను దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా కళుక్కుళ్ యీరం(రాళ్లకు కన్నీళ్లు వస్తాయి) లో ఆమెకు మొట్టమొదటిసారిగా హీరోయిన్ ఛాన్స్ సమర్పించాడు. ఈ సినిమా 1979 వ సంవత్సరంలో విడుదల కాగా... అప్పటికి ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమా తమిళంలో యావరేజ్ టాక్ ని సంపాదించింది. అయితే అప్పటి వరకు శాంతి గా ఉన్న ఈ హీరోయిన్ పేరు సినిమాలో అరంగేట్రం చేసిన అనంతరం తన పిన్ని పేరు నుండి 'విజయ' ని తీసుకొని తన పేరు ముందు తగిలించుకున్నారు. దాంతో శాంతి పేరు కాస్త విజయశాంతి గా మారిపోయింది.

IHG
కళుక్కుళ్ యీరం సినిమాని చూసిన విజయనిర్మల తను డైరెక్ట్ చేస్తున్న కిలాడి కృష్ణడు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ  సరసన ఈమెను నటింపజేసారు. అయితే ఈ సినిమా 1981వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకి రాగా... విజయశాంతి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. తదనంతరము ఆమె ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. తమిళ,  కన్నడ చిత్రాల్లో కూడా ఆమె నటించి మంచి పేరుని తన సొంతం చేసుకున్నారు. ప్రతిఘటన సినిమాలో నటించినందుకు గాను ఆమెకు రాష్ట్ర నంది అవార్డు లభించింది. మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి కలిసి నటించిన స్వయంకృషి సినిమా మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రసారం చేయబడింది. 

IHG
1990 లో విడుదలైన కర్తవ్యం సినిమా లో విజయశాంతి వైజయంతి ఐపీఎస్ అనే పాత్రలో చాలా చక్కగా నటించి అందరి ప్రశంసలు పొందారు. అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను ఆమె కోటి రూపాయలు పారితోషికం తీసుకొని అప్పట్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక ఫిమేల్ యాక్టర్ గా రికార్డు బద్దలు కొట్టారు. 1980-90 సంవత్సరాలలో భారత దేశంలోనే అత్యంత పాపులారిటీ అట్రాక్టివ్ పర్సనాలిటీ ఉన్న మహిళగా విజయశాంతి నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: