తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక దశాబ్ద కాలం పైగా ఒక వెలుగు వెలిగిన సునీల్ పరిస్థితి పూర్తి అయోమయంలో ఉంది. హీరోగా ఫెయిల్ కావడంతో తిరిగి కమెడియన్ పాత్రలకు యూటర్న్ తీసుకుందామని సునీల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క త్రివిక్రమ్ తప్ప ఎవరు సునీల్ కు సహకరించడం లేదు.


ఒకానొక సమయంలో సునీల్ లేకుండా టాప్ హీరోల సినిమాలు ఉండేవి కావు. అయితే ఇప్పుడు సునీల్ కు పాత్రను క్రియేట్ చేయమని కనీసం మిడిల్ రేంజ్ హీరోలు కూడ చెప్పకపోవడం ఆశ్చర్యం. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ కమెడియన్స్ వెన్నెల కిషోర్ ప్రియదర్శి సత్య లాంటి కమెడియన్స్ హవా నడుస్తున్న పరిస్థితులలో ప్రేక్షకులు కూడ సునీల్ కామెడీని ఇప్పుడు చూడడానికి పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు.


దీనితో కనీసం విలన్ గా అయినా మారాలని ‘డిస్కోరాజా’ మూవీలో ఒక ప్రయత్నం చేసాడు అయితే ఆప్రయత్నం కూడ ఫెయిల్ అయింది. అయినప్పటికీ కొందరు దర్శకులు సునీల్ ను విలన్ పాత్రల విషయమై సంప్రదిస్తుంటే సునీల్ రెండు డిమాండ్స్ చేస్తున్నాడట. విలన్ గా చేయాలంటే సుమారు కోటి రూపాయలు కావాలి అనీ లేదంటే రోజుకు 3 లక్షలు చొప్పున పారితోషికం కావాలి అంటు కొత్త డిమాండ్ పెడుతున్నట్లు టాక్.


ఇలాంటి పరిస్థితులలో ఈ కరోనా పరిస్థితుల ముందు సునీల్ విలన్ గా నటించడానికి ఒప్పుకున్న ‘కలర్ ఫోటో' మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ మూవీలో పూర్తి స్థాయి విలన్ గా సునీల్ నటిస్తున్నాడని సమాచారం. ఇటీవల కమెడియన్ గా పరిచయమైన సుహాస్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. మరి ఈ కొత్త హీరోకి సునీల్ విలన్ గా ఎలాంటి చుక్కలు చూపెట్టి ఈ సినిమా విజయానికి ఎంత వరకు సహకరిస్తాడో చూడాలి. సందీప్ రాజ్ అనే కొత్త దర్శకుడు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: