తెలుగు పరిశ్రమలో భారీ హిట్ గా నిలిచిన బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ, జెనీలియా, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, జయసుధ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కుటుంబ భరితమైన చిత్రానికి డైరెక్టర్ భాస్కర్ స్క్రీన్ ప్లే, కథను అందించడంతో పాటు దర్శకత్వం కూడా తానే వహించాడు. ఈ చిత్రానికి అబ్బూరి రవి రాసిన డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తన అభిప్రాయాలను, భావాలను అన్ని తన కొడుకు పై రుద్దే తండ్రి పాత్రలో ప్రకాష్ ప్రకాష్ రాజ్ అద్భుతంగా నటించగా... అతడి కొడుకు పాత్రలో సిద్ధార్థ జీవించేశాడు. 


సిద్ధార్థ సహజ నటనకు అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పుకోవచ్చు. సిద్ధార్థ సరసన నటించిన జెనీలియా కూడా అత్యంత సహజంగా నటించి అందరి ప్రశంసలను అందుకున్నది. ఈ సినిమాలో జెనీలియా ఎప్పుడూ సంతోషంగా ఉండే అమాయకపు కాలేజీ అమ్మాయి అయిన హాసిని పాత్రలో నటించింది. జెనీలియాకు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితా రెడ్డి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలెట్ హాసిని తియ్యటి వాయిస్ అని చెప్పుకోవచ్చు. 

IHG's Hasini That Will Make Us Fall For Her ...
ఈ సినిమాలోని హ హ హ హాసిని, అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అనే డైలాగులు డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా జెనీలియా చెప్పే వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ డైలాగ్ తెలుగు ప్రేక్షకుల నోట ఇప్పటికీ నానుతూనే ఉంది. సిద్దు(సిద్ధార్థ) తన తండ్రికి తన బాధని బయట పెట్టే సన్నివేశాల్లో డైలాగులు కూడా చాలా ఆకట్టుకుంటాయి. ఏది ఏమైనా ఈ సినిమా సిద్ధార్థ, జెనీలియా కెరీర్స్ లలో ఎప్పటికీ మరిచిపోలేని హిట్స్ గా నిలిచాయి. మళ్లీ ఇటువంటి గొప్ప తండ్రీ కొడుకుల డ్రామా తెలుగులో ఎప్పటికీ రాదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: