లాక్ డౌన్ సమయంలో నిలిచిపోయిన వ్యవస్థల్లో సినీ పరిశ్రమ కూడా ఉంది. షూటింగ్స్ ఆగిపోవడంతో సినీ నటులంతా ఎక్కడికక్కడ ఇళ్లకే పరిమితం అయిపోయారు. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తేశారు. సినిమా షూటింగ్స్ కు పర్మిషన్లు వచ్చినా ఎక్కడా షూటింగ్స్ జరిపేందుకు ఎవరూ సాహసించటం లేదు. ప్రస్తుతం కరోనా సృష్టిస్తున్న విలయం వల్లే ఇదంతా. అయితే.. స్టార్ హీరోయిన్ రకుల్ సినిమా షూటింగ్స్ ప్రారంభమైనా రావట్లేదు అంటూ రాశారు. దీంతో ఆమె జర్నలిజంను దూనమాడుతూ ట్విట్ చేసింది. రకుల్ ప్రస్తుతం తమిళ్ లో భారతీయుడు2, ఆయలాన్ సినిమాలు చేస్తోంది.

IHG

 

అయితే.. సదరు వెబ్ మీడియా ‘ఆయలాన్ షూటింగ్ ప్రారంభించడానికి అన్ని ప్రయత్నాలు చేసుకున్నారు. కానీ.. రకుల్ మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ కు రానని చెప్పింది. దీంతో రకుల్ కు ప్రత్యామ్నాయ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు’ అంటూ ఓ వార్త రాసేసింది. ఈ వార్తతో అవాక్కయిన రకుల్ తనదైన స్టైల్లో ట్విట్టర్ లో విరుచుకుపడింది. ‘షూటింగ్స్ ఎక్కడ, ఎవరు ప్రారంభించారో ఈ వార్త రాసిన వాళ్లు చెప్తే షూటింగ్ కు వెళ్లడానికి రెడీగా ఉన్నాను. షూటింగ్ కు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురుచూస్తున్నా. మీ జర్నలిజం ఎప్పుడు వాల్యూస్ నేర్చుకుంటారు. ఎన్నాళ్లు ఇలా ఫేక్ జర్నలిజం నడిపిస్తారు.. నిజాలు ఎప్పుడు తెలుసుకుంటారు’ అని ఏకిపారేసింది.

IHG

 

రకుల్ పై ఎప్పుడూ ఏదొక వార్త రావడం ఆమె ఖండించడం జరుగుతోంది. ప్రతిసారి ఆమె మాటే నిజమవుతోంది కూడా. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కెరటంలా రకుల్ కెరీర్ అయిదేళ్లు తెలుగులో బ్రహ్మాండంగా కొనసాగింది. కానీ.. వరుస ఫెయిల్యూర్స్ ఆమె కెరీర్ ను తెలుగులో డోలాయమానంలో పడేసింది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో ఆఫర్స్ లేవు. బాలీవుడ్ పై దృష్టి పెట్టి సినిమాలు చేసినా అమ్మడికి అక్కడ కూడా అవకాశాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: