మన తెలుగు లో అగ్ర హీరోల సినిమాలు అనగానే చాలా మందికి ఒక రేంజ్ లో ఆసక్తి అనేది ఉంటుంది. సినిమా ఎప్పుడు వస్తుంది ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు కథ ఏంటీ అనే ఆసక్తి ఉంటుంది. సినిమా గురించి కొన్ని కొన్ని విషయాలు కూడా ఎక్కువగానే హైలెట్ అవుతూ ఉంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమాలో  హీరో పాత్ర విషయంలో అసలు ఏ విధంగా దర్శక నిర్మాతలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది జనాలకు ఒక క్రేజ్ అనేది ఉంటుంది. అది ఏ హీరో ఆయినా సరే అదే రేంజ్ లో ఉంటుంది. 

 

ఇక ఇప్పుడు మన తెలుగు లో దానిని మార్కెట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకు అంటే నష్టాలు ఎక్కువగా వస్తున్న నేపధ్యంలో ఇక నుంచి ప్రతీ ఒక్కటి కూడా మార్కెట్ చేసే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. అగ్ర హీరోల సినిమాలకు సంబంధించిన ప్రతీ ఒక్కటి మార్కెట్  చేసి వాడుకోవాలి అని చూస్తున్నారు. సినిమా టైటిల్ ని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీడియా సంస్థలకు ఇవ్వాలని భావిస్తున్నారు. టైటిల్ ప్రకటించడం తో పాటుగా దానిని ప్రమోట్ చేసే ఆలోచన కూడా వారిదే. పాటలు ఒకరికి ఫస్ట్ లుక్ ఒకరికి ఇలా కొన్ని కొన్ని ఇస్తారు అని సమాచారం. 

 

ఒక హీరో కి లేదా ఒక నిర్మాతకు సంబంధించిన మొత్తం ప్రచారం కూడా ఆ సినిమాకు వాళ్ళే చేస్తారు. ఇలా రెండు మూడు సినిమాలకు ఒప్పందం చేసుకోవడం లేదా ఆ సినిమా కు మాత్రమే చేసుకోవడం అనేది ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్లాన్ ని రెడీ చేసే అవకాశం ఉంది అని సమాచారం. చూడాలి మరి అసలు ఎం జరుగుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: