ఇప్పుడు టాలీవుడ్ లో బయోపిక్ ల విషయంలో ఏ వార్త వచ్చినా సరే జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి అనేది ఉంటుంది. బయోపిక్ గురించి ఏ ప్రచారం జరుగుతున్నా సరే జనాలు మాత్రం ఆ సినిమా ఏ విధంగా ఉంటుంది పాత్రలు ఎవరు చేస్తున్నారు, ఏ బయోపిక్ నిర్మాత ఎవరూ అంటూ ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే టాలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలు అందరూ కూడా బయోపిక్ ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే. ఇప్పుడు ఒక వార్త ఏంటీ అంటే.. 

 

టాలీవుడ్ లో ఈ మధ్య నిర్మాణాల విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు ఈ సినిమాలను నిర్మించే ఆలోచన లో ఉన్నాడు అని అంటున్నారు. అవును అతను ఒక బయోపిక్ కథను విన్నాడు అని టాక్. ఒక తమిళ వ్యాపారవేత్త వేత్తకు సంబంధించిన బయోపిక్ అని దాని కథ అతను విన్నాడు అని త్వరలోనే ఆ స్టోరీ ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉంది అని సమాచార. ఆయనకు తెలుగు లో కూడా కాస్త పేరు ఉంది అని ఆ పాత్రలో తాను చేస్తే కచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుంది అని రామ్ చరణ్ భావిస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

దీనికి సంబంధించి త్వరలోనే అన్నీ సెట్ చేసుకుని సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది చూడాలి మరి. ఇక రామ్ చరణ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాతనే అతను ఏ సినిమా చేసినా అని టాలీవుడ్ లో అంటున్నారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: