ప్రభాస్ సినిమా అనగానే జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉంటుంది. ప్రభాస్ సినిమా వస్తుంది అంటే చాలు కథ ఏ విధంగా ఉంది సినిమా ఏ విధంగా ఉంటుంది అంటూ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అతను రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఇప్పుడు దాదాపుగా ఈ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టే అవాకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో అంటున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త ప్రభాస్ కి సంబంధించి హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ఇప్పుడు పూరి తో ఒక ప్రాజెక్ట్ ని చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. అవును పూరి తో ఒక ప్రాజెక్ట్ ని చేయడానికి గానూ ఆసక్తి చూపిస్తున్నాడు అని సమాచారం. మరి ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే అతను పూరి తో ఒక ప్రాజెక్ట్ ని చేయడం ఖాయమని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నీ కూడా రెడీ అయ్యాయి అని అంటున్నారు. కథ కూడా దాదాపుగా విన్నాడు అని అది నచ్చింది అని అంటున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది తీసుకోస్తారట. 

 

ఇక టాలీవుడ్ లో దీనిపైనే ఇప్పుడు చర్చలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మహేష్ తో పూరి సినిమా చెయ్యాలి అని భావించినా సరే అది సాధ్యం అయ్యే సూచనలు కనపడటం లేదు అని అంటున్నారు. అందుకే ఇప్పుడు ప్రభాస్ తో ఒక ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: