టాలీవుడ్ లో చేసిన సినిమాలు రెండే అయినా సరే సుజిత్ కి మాత్రం మంచి డిమాండ్ వచ్చింది. బాబు సినిమాలు రెండు కూడా అంతగా ఆకట్టుకోలేదు గాని 30 ఏళ్ళు కూడా రాకుండానే సీనియర్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ని కొట్టేసాడు అని టాలీవుడ్ జనాలు ఇప్పుడు బాబు గురించి చర్చిస్తున్నారు. అగ్ర హీరోలతో అతనికి సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. దానికి కారణం సాహో సినిమాను అతను తీసిన విధానం. కథ ఏ విధంగా ఉన్నా సరే సినిమా మాత్రం ఆకట్టుకుంది. చాలా అనుభవం ఉన్న యాక్షన్ దర్శకుడి గా అతను ఆ సినిమాను  చేసాడు. 

 

ఇక కథ చెప్పగానే ముందే ఓకే చేసిన ప్రభాస్ మరో సారి ఆలోచన అనేది లేకుండా సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు అతనికి రామ్ చరణ్ కూడా ఛాన్స్ ఇచ్చాడు అని తెలుస్తుంది. సాహో సినిమా ఫ్లాప్ అయినా సరే ఛాన్స్ ఇవ్వడం చూసి ఇప్పుడు చాలా మంది షాక్ అవుతున్నారట. ఎందుకు అలా ఇచ్చి ఉంటాడు అనేది అర్ధం కావడం లేదు అని అంటున్నారు. ఆ సినిమాను భారీ బడ్జెట్ తో కూడా ప్లాన్ చేసారు అని సమాచారం. ఈ సినిమా విషయంలో చిరంజీవి సలహాలు తీసుకుని ముందుకి అడుగులు వేస్తున్నారు అని తెలుస్తుంది. 

 

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సుజిత్ ఇప్పటికే కథను కూడా రెడీ చేస్తున్నారు అని సమాచారం. ఇక దాదాపు 150 కోట్ల తో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది అనే ప్రచారం మాత్రం జరుగుతుంది. మరి నిజమా కాదా అనేది చూడాలి అంటే కచ్చితంగా కొన్ని రోజులు ఆగాలి. ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: