అటు మాస్ గాను ఇటు క్లాస్ గాను మెప్పించగల హీరోయిన్ ఛార్మింగ్ గాళ్ ఛార్మీ కౌర్. ఈమె అగ్రహీరోల సరసన నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సక్సస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో నటనకు దూరమైంది.

 

 

నీతోడు కావాలి’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు 14 ఏళ్ల వయసులో పరిచయం అయిన హీరోయిన్ ఛార్మి..ఆ తర్వాత  ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో ఈ అమ్మడు తడి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  ఆ తర్వాత ‘గౌరీ’, ‘మంత్ర’ లాంటి సినిమాలతో తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరలేదు. 

 

 

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఛార్మి కౌర్‌ నటించిన చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ఇందులో ఛార్మి వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. సినిమా కథలోకి వెళ్తే సత్య తను కోరుకున్న అమ్మాయిని దక్కించుకునేందుకు వేశ్యవాటికకు వెళ్తాడు. అక్కడ తను ఇష్టపడే జ్యోతిలక్ష్మి తారసపడుతుంది. ఎలాగైన సరే ఆమెను పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. కానీ ఆ వేశ్యవాటికి చెందిన యజమానికి ఇది నచ్చదు.

 

 

దీంతో జ్యోతిలక్ష్మిని అక్కడి నుంచి తప్పించి పెళ్లిచేసుకొంటాడు. తరువాత అతను రౌడీలో చేతిలో దెబ్బలు తిని ఆసుపత్రి పాలవుతాడు. దింతో భర్తను కాపాడుకోవడానికి జ్యోతిలక్ష్మి ఏం చేసిందనేది మిగతా కథ. మొత్తం మీద కథానాయికగా గ్లామర్‌ పాత్రలను నుంచి ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించడానికి ముందుకొచ్చిందంటే ఛార్మికి ఉన్న ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.

 

 

అంతేకాదు సినిమా పాత్ర పట్ల ఉన్న ప్రేమ ఎంతో గొప్పదో చెప్పవచ్చునని పలువురు సినీ ప్రముఖలు ప్రశంసించారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, అజయ్‌ ఘోష్‌, ఉత్తేజ్‌, సప్తగిరి, ధనరాజ్‌ సత్య రమేష్‌ తదితరలు నటించారు. సునీల్‌ కశ్యప్‌ సంగీత స్వరాలు సమకూర్చగా, పీజీ విందా కెమెరామేన్‌గా వ్యవహరించారు. చార్మింగ్ బ్యూటీ ఛార్మి ..ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: