సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంత దిగజారిపోయాడో చెప్పడానికి మరో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది నగ్నం సినిమా. దీన్ని సినిమా అనే కంటే షార్ట్ ఫిలిం అనడం కరెక్ట్. 22 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా చూస్తోన్న ప్రేక్షకుడికి నవరాంధ్రాల్లో సూదులు గుచ్చినంత నరకం కనపడుతోంది. ఓ ఇంట్లో జరిగిన అక్రమ సంబంధం చెత్త కథను ఓ షార్ట్ ఫిల్మ్ గా తీసి పడేశాడు. చాలా చెత్త నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ సినిమా చూస్తుంటే ఎప్పుడు 1990లో షకీలా సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఇక వర్మ సినిమాలో హీరోయిన్ ఫుల్ ఎక్స్ పోజింగ్, కెమేరా యాంగిల్స్ తప్పితే ఏం కనపడవు. కనీసం హీరోయిన్ కు అయినా నటించే ఛాన్స్ ఇవ్వలేదు. హీరోయిన్ తన అందాల్ని హాటుగా చూపించడం, ఘాటుగా కవ్వించేలా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం వరకే స్వీటీని పరిమితం చేశాడు. ఇక సినిమాలో హీరోయిన్ కు ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టకూడదో ఆలోచించి మరీ అక్కడే ఫ్రేమ్స్ ఫిక్స్ చేశాడు. వర్మ ఎంత పైశాచికంగా ఆలోచించాడంటే హీరోయిన్ శరీరంలో ఎక్కడ అయితే కెమేరాలో దూరవో అక్కడ మొబైల్ పెట్టి మరీ షూట్ చేశాడు.
దీనిని బట్టి ఈ సినిమా చూస్తుంటే నరకం కాక మరేం కనపడుతుంది. ఇక రు. 200 పెట్టి ఈ సినిమా చూసిన వారు లబోదిబో మంటున్నారు. ఏం సినిమారా బాబు ఇది కనీసం యూ ట్యూబ్లో ఏదైనా ఓ హాట్ సినిమ చూసినా దీని కన్నా చాలా బెటర్ అని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా వర్మ మరోసారి జనాలను మోసం చేశాడు. ఫైనల్గా వర్మ పైశాచికత్వానికి, పీక్స్ లో అంగాంగ ప్రదర్శనకు మాత్రమే ఈ 22 నిమిషాల బొమ్మ సరిపోతుంది.