కరోనా కేసులు స్థాయి వివరీతంగా పెరిగిపోతున్న పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం మరొక కఠినమైన లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తోంది. దీనితో అక్కడక్కడా మొదలైన షూటింగ్ లు మళ్ళీ ఆగిపోతాయి. ఇలాంటి పరిస్థితులలో రాజమౌళి పరిస్థితులతో రాజీపడి తన ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను గాలిలో దీపంలా వదిలేసాడు.


ఈసినిమాకు ఇంకా షూటింగ్ 50 శాతంకు పైగా మిగిలి ఉండటంతో పాటు ఈమూవీకి విపరీతమైన గ్రాఫిక్ వర్క్స్ అవసరం ఉన్న పరిస్థితులలో కనీసం వచ్చే ఏడాది సమ్మర్ కు అయినా విడుదల అవుతోందా అన్న సందేహాలు ఏకంగా రాజమౌళికే ఉన్నట్లు టాక్. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ హక్కుల కోసం ఇప్పటికే కోట్ల రూపాయలలో అడ్వాన్స్ లుగా ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు తాము ఇచ్చిన అడ్వాన్స్ లను వెనక్కు ఇమ్మని ఈమూవీని తీస్తున్న నిర్మాత పై ఒత్తిడి చేస్తున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి.


దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ ఎప్పుడు విడుదల అవుతుంది ఈమూవీ మార్కెట్ ఎంతవరకు అవుతుంది ఈమూవీకి ఏ రేంజ్ లో కలక్షన్స్ వస్తాయి అన్న విషయాల పై ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడ అంచనాలు వేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో రామ్ గోపాల్ వర్మ రాజమౌళికి ఒక విచిత్ర సలహా ఇచ్చాడు.


ధియేటర్ల రీ ఓపెనింగ్ గురించి కరోనా సమస్యల కట్టడి గురించి విపరీతంగా ఆలోచనలు చేయకుండా తనలాగే ఏదోవిధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ ను ఈ కరోనా సమస్యల మధ్య కూడ పూర్తిచేసి తాను లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ‘నగ్నం’ సినిమాలా ఒటీటీ ద్వారా విడుదల చేస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ కు రాజమౌళికి ఉన్న క్రేజ్ రీత్యా మూడు రోజులలో 1000 కోట్లు కలక్షన్స్ రావడం ఖాయం అని అంటున్నారు. ప్రజలు సినిమా ధియేటర్లకు వెళ్ళడం అన్న అలవాటును పూర్తిగా మర్చిపోయిన రోజులలో రాజమౌళిని తనలాగే మారిన పరిస్థితులకు తగ్గట్టుగా సినిమాలు తీసి ఆ సినిమాలను తనలాగే ఒటీటీ ద్వారా విడుదల చేయడమే మార్గం అంటూ వర్మ జక్కన్న మైండ్ ను బ్లాంక్ చేస్తున్నాడు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: