ఈమధ్య చాలామంది హీరోలు షూటింగ్ స్పాట్ లో గాయాల బారిన పడుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్ చేరిపోయాడు. శ్రీకాంత్ అడ్డాల మూవీ ‘గొల్లభామ’ షూటింగ్ ప్రస్తుతం కేరళలోని అలెప్పీలో జరుగుతోంది. ఫైటర్లు రామ్, లక్ష్మణ్ పర్యవేక్షణలో వరుణ్ తేజ్‌పై ఓ సీన్ చిత్రీకరిస్తుండగా, వరుణ్ తేజ్ కాలికి తీవ్ర గాయమైంది అని వార్తలు వస్తున్నాయి.  దీనితో షూటింగ్‌ని నిలిపివేశారు అని తెలుస్తోంది. ‘గొల్లభామ’ చిత్రంలో వరుణ్ వాలీబాల్ ప్లేయర్‌గా నటిస్తున్నాడు. రొమాన్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రంలో వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. గోదావరి జిల్లాల భాషతో ఈ సినిమాలో వరుణ్ తేజ్ సంభాషణల తో పాటు లుక్ కూడ విభిన్నంగా ఉండేటట్లుగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. కాలిగాయం నుండి వరుణ్ తేజ్ తెరుకోగానే ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం అవుతుందని సమాచారామ్  మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే.మేయర్ ఈ సినిమా కోసం అద్భుతమైన ట్యూన్స్ రెడీ పెడుతున్నాడని ఫిలిం నగర్ టాక్. ఈసినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరాకు తీసుకు వద్దామని యూనిట్ ప్రయత్నిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: