టాలీవుడ్ ప్రస్తుతం అంచనాలు ఎక్కువగా ఉన్న సినిమాల్లో బాలకృష్ణబోయపాటి కాంబినేషన్ ఒకటి. సింహ, లెజెండ్ సినిమాలతో వీరిద్దరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడమే ఇందుకు కారణం. మూస పద్ధతిలో వెళుతున్న బాలయ్యను సింహాలో పర్ఫెక్ట్ లుక్, అంతకుమించి పవర్ ఫుల్ పాత్రలో చూపించాడు బోయపాటి. అప్పటినుంచి బాలయ్య ట్రాక్ మారిపోయింది. లెజెండ్ రూపంలో మరో సూపర్ హిట్ కొట్టారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా రలీజ్ చేసిన ఫస్ట్ లుక్ వీడియో అంచనాలను ఇంకా పెంచేసింది.

IHG

 

అయితే.. ఈ సినిమా టైటిల్, హీరోయిన్ విషయంలో ఇండస్ట్రీలో గాసిప్స్ ఎక్కువైపోయాయి. మోనార్క్, సూపర్ మేన్.. అని టైటిల్స్ విషయంలో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. నెట్టింట్లో కూడా ఇదే విషయం హాట్ టాపిక్. ఇక హీరోయిన్ విషయంలో కూడా శ్రియ, అంజలి, అమలా పాల్.. అంటూ రకరకాల కథనాలు వచ్చేస్తున్నాయి. ఈ వార్తలన్నింటికీ బోయపోటి ఫుల్ స్టాప్ పెట్టాడని అంటున్నారు. సినిమా టైటిల్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. హీరోయిన్ ను ఇప్పటికే ఫిక్స్ చేశాం. అయితే.. ఇది సరైన సమయం కాదని ఏ విషయం కూడా రివీల్ చేయడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తామని చెప్పినట్టు సమాచారం.

IHG

 

బోయపాటి, బాలయ్య ఇద్దరూ ప్రీవియస్ గా ఫ్లాపులిచ్చారు. వినయ విధేయ రామతో బోయపాటి, రూలర్ తో బాలకృష్ణ ఫ్లాపుల్లో ఉన్నారు. దీంతో వీరిద్దరికీ ఇప్పుడు హిట్ అవసరం. దీంతో.. ప్రీవియస్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వీరిద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. పరిస్థితులు అనుకూలించాక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: