టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు దాదాపుగా కోరుకునేది వినోదం అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. సినిమాలను విడుదల చేసినా సరే కాసేపు హాయిగా ఎంజాయ్ చేసే సినిమాలు ఉండాలి అని భావిస్తున్నారు. గతంలో మాదిరిగా యాక్షన్ సినిమాలను చూసే అవకాశాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి. అందుకే స్టార్ హీరోలు అయినా చిన్న హీరోలు అయిన సరే కథ విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి సినిమాలను చెయ్యాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాలి. టాలీవుడ్ లో ఇప్పుడు ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే చూసే అవకాశాలు కూడా ఉండవు అని చెప్పాలి. 

 

ఇప్పుడు స్టార్ హీరోలు కథ విషయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి ఒక సలహా ఇచ్చాడని టాక్... తాము చేసే సినిమా విషయంలో కథ యాక్షన్ వద్దు అని కేవలం వినోదం మాత్రమే ఉండే విధంగా జాగ్రత్తలు పడాలి అని చెప్పాడు అని సమాచారం. త్రివిక్రమ్ కూడా అదే విధంగా కథను రాస్తున్నాడు అని యాక్షన్ సన్నివేశాలు ఉన్నా సరే జనాలు ఇప్పుడు అంత ఆసక్తిగా చూసే అవకాశం లేదని అంటున్నారు. ఇక అది అలా ఉంటే ఇప్పుడు మరో హీరో కూడా కథ విషయంలో దృష్టి పెట్టాడు. 

 

ప్రభాస్ కూడా తన సినిమాల్లో యాక్షన్ అనేది వద్దు అని చెప్పాడు అని సమాచారం. యాక్షన్ ఉంటే గతంలో మాదిరిగా చూసే అవకాశం ఉండదు అని కాబట్టి యాక్షన్ లేకుండా ప్లాన్ చెయ్యాలి అని తాను నాగ్ అశ్విన్ తో చేసే సినిమాకు సంబంధించి పలు సూచనలు చేసాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ముందు చెప్పారు గాని లాక్ డౌన్ దెబ్బకు కరోనా దెబ్బకు అలాంటి అవకాశాలు దాదాపుగా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: