నటి రకుల్ ప్రీత్ సింగ్ తనకు ప్రేమ, సాంప్రదాయ బద్ధమైన పెళ్లి మీద ఎంతో నమ్మకం ఉందని చెప్పింది. కానీ ప్రజలు పెళ్లి బాధ్యతలను ఎందుకు బరువుగా భావిస్తున్నారో నాకు అర్ధం కావటం లేదని చెప్పింది రకుల్‌.  ఇటీవల తన వ్యక్తి గత జీవితం గురించి మాట్లాడిన రకుల్‌ ఈ రోజు ఆసక్తికర విషయాలు చెప్పింది.

 

`నేను వ్యక్తిగా చాలా మారాను. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అది నేను కాదు. నా దృష్టిలో ప్రేమ అంటే నా తల్లి దండ్రులు నా పట్ల చూపించేదే నిజమైన ప్రేమ. అందుకే నాకు పెళ్లి, ప్రేమ పట్ల ఎంతో నమ్మకం ఉంది. అంతేకాదు అది ఎంతో అందమైన బంధం. కానీ ప్రజలు పెళ్లిని ఎందుకు ప్రజర్‌గా ఫీల్ అవుతారో నాకు అర్ధం కావటం లేదు. ఒక వ్యక్తిని ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ఆ వ్యక్తిని ప్రేమిస్తాను. నేను అలాంటి వ్యక్తిని` అంటూ చెప్పుకొచ్చింది.

 

అదే సమయంలో తాను చేసుకోబోయే అబ్బాయిలో ఉండాల్సిన లక్షణాల గురించి కూడా చెప్పింది రకుల్‌. `ముఖ్యంగా నేను చేసుకోబోయే అబ్బాయి పొడుగ్గా ఉండాలి. నేను హీల్స్‌ వేసుకున్నా కూడా తనని తల ఎత్తి చూడాలి. మరో విషయం అతను తెలివైన వాడు అయ్యుండాలి, జీవితం పట్ల అవగాహనా ఓ గోల్ ఉండాలి` అంటూ చెప్పుకొచ్చింది రకుల్‌.

 

`నేను చిన్నతనం నుంచి నటిని కావాలనుకున్నా.. అందుకే చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. 18 ఏళ్లకే గ్లామర్ ఫీల్డ్‌లో అడుగుపెట్టాను. తొలి సినిమాను నేను పాకెట్‌ మనీ కోసం నటించాను. తొలి అవకాశం నాకు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది` అంటూ తన కెరీర్‌ గురించి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: