శ్రీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ తమన్నా.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. మొదటగా వచ్చిన శ్రీ సినిమాలో తమ్ము నటన ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే..ఆ సినిమా తర్వాత హ్యాపిడేస్ సినిమాలో నటించింది.. ఆ సినిమా మంచి టాక్ ను అందుకుంది..అలా వరుస సినిమాలలో నటిస్తూ వచ్చిన తమన్నా అలియాస్ మిల్క్ బ్యూటీ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. 

 


బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సినిమాలో ప్రముఖ పాత్రలో తమన్నా నటించి వారెవ్వా అని జనాల చేత అనిపించారు.. అయితే తమన్నా మహారాష్ట్ర కు చెందిన అమ్మాయి..వేరే భాష నుంచి వచ్చిన కూడా తెలుగు సినిమాలలో నటిస్తూ తెలుగును చక్కగా నేర్చుకుంది.. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాలలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.. మిల్క్ బ్యూటీ గా ఉన్న తమ్ము స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు.. 

 

 


ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల కన్నా కూడా ఐటమ్ సాంగ్స్ లలో ఎక్కువగా నటిస్తూ యువతను మరింతగా ఆకట్టుకుంటుంది.ఈ మద్య యువతను సినిమాలు బాగా ఆకట్టుకోవడంతో సినిమాలు కూడా బాగా హిట్ అవ్వడమే కాదు.. ఒక్క రోజులోనే భారీ కలెక్షన్స్ కూడా రాబడుతో వస్తున్నాయి. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఎలాంటి సినిమా తీస్తే జనాలను ఆకట్టుకుంటుంది దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు..అంతకు మించిన అందాలను ఆరబోస్తూ వారానికొక సినిమా దర్శనమిస్తున్నాయి... 

 

 

అయితే సినిమాలలో నటించడం కన్నా కూడా ఐటమ్ సాంగ్ లలో నటిస్తే ఈజీగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారని స్టార్ హీరోయిన్లు అంటున్నారు..అలా అందాలకు తెర తీస్తూ ఐటమ్ సాంగ్ లలో దుమ్ము రేపుతున్నారు.. దాంతో తమ్ము కూడా అదే పనిలో ఉంది..అల్లుడు శీను సినిమాలోని నా వొంటి రంగు మిల్క్ నా ఇంటి పేరు సిల్క్ అనే పాటలో అదరగొట్టింది.. ఆ పాటతో సినిమాకు అటు తమన్నా ఇద్దరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది.. ఎంతైనా తమన్నా పాట కదా ఆ మాత్రం వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా ఎంటి అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: