పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా విడుదల అయ్యి పెద్ద వివాదాలకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రాజకీయ పార్టీల గురించి తప్పుగా చూపించారని అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగింది. తెలంగాణ ఉద్యమం గురించి కూడా నెగటివ్ గా చూపించారని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా పై అనేక గొడవలు, వివాదాలు, నిరసనలు జరిగాయి.


ఈ సినిమాలోని డైలాగులు టిడిపి, వైఎస్ఆర్సిపి పార్టీలని ఉద్దేశిస్తూ నెగిటివ్ గా ఉన్నాయని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద దుమారమే రేగింది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలుపుతూ దర్శకుడు పూరీ జగన్నాథ్ తో మాట్లాడుతూ ఈ డైలాగులు, సన్నివేశాలు ఏదో తేడాగా ఉన్నాయి. వీటిని సినిమాలో పెడితే పెద్ద గొడవలు అవుతాయి ఏమో?! ఇలాంటివి అవాయిడ్ చేయండి అని సూచించాడు.


కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఆ సన్నివేశాలకు ఏ రాజకీయ విషయాలకు సంబంధమే లేదని, తాను ఎవరిని ఉద్దేశించి సినిమా రూపొందించడం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ ని ఒప్పించి మరీ ఆ సన్నివేశాన్ని డిలీట్ చేయకుండా అలాగే సినిమాలో చూపించాడు. పవన్ కళ్యాణ్ ముందస్తుగా అనుకున్నట్టే సినిమా విడుదల కాగానే అనేకమైన వివాదాలు తలెత్తాయి. దీంతో పూరి జగన్నాథ్ కారణంగా పవన్ కళ్యాణ్ పెద్ద ఇరకాటంలో చిక్కుకుపోయాడు.


దీంతో పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కి ఫోన్ చేసి మీడియా ముందుకు వచ్చి ఈ సినిమాలోని సన్నివేశాలపై సమర్థత ఇచ్చుకోవాల్సిందిగా చెప్పాడు. దీంతో అయిష్టంగానే పూరి జగన్నాథ్ మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక సమాధానం చెప్పి బయటపడ్డాడు. ఏది ఏమైనా అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని రెచ్చగొట్టే సన్నివేశాలు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా లో ఉండడంతో అప్పట్లో పవన్ కళ్యాణ్ అనేక విమర్శలకు బాధితుడు అయ్యాడు.



Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: