పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచిన తొలిప్రేమ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఇద్దరు నటీమణులను ఎవరూ మర్చిపోలేరు. అందులో ఒకరు కీర్తి రెడ్డి కాగా మరొకరు వాసుకి అని చెప్పుకోవచ్చు. ఈ రొమాంటిక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి చెల్లిగా ప్రియ పాత్రలో నటించిన వాసుకి సినిమా సెట్స్ లో ఎంతో అల్లరి చేసేదట. పవన్ కళ్యాణ్ తో ఎక్కువ సమయం గడుపుతూ అతడిని బాగా ఆటపట్టించేదట. పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఫిలాసఫీ ఆమెకు చెబుతూ అది కూడా తెలియదా అని ఆటపట్టించేవాడట. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యేలోపు పవన్ కళ్యాణ్ వాసుకి మంచి మిత్రులయ్యారట. ఈ విషయాలను సాక్షాత్తు వాసుకి ఒక ఇంటర్వ్యూలో చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అంటే తనకు బాగా ఇష్టం అని, అతను స్టార్ హీరో తమ్ముడు అయినప్పటికీ చాలా సామాన్యుడి వలే నడుచుకుంటారని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారని ఆమె చెప్పుకొచ్చింది.


తొలిప్రేమ సినిమా కి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆనంద్ పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులని, సెట్స్ లో వాళ్ళిద్దరూ బాగా మాట్లాడుకుంటూ నవ్వుకునేవారని... ఒకరోజు పవన్ కళ్యాణ్ తనని పిలిచి ఆనంద్ కి పరిచయం చేశాడని... కానీ ఆనంద్ మాత్రం తన మొహం కూడా చూడకుండా హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడని వాసుకి చెప్పుకొచ్చింది. ఈ ఆర్ట్ డైరెక్టర్ కి ఇంత ఆటిట్యూడ్ ఉందేంటి అని పవన్ కళ్యాణ్ ని అడిగితే... అతనికి కొత్తవారితో మాట్లాడాలంటే చాలా సిగ్గు. మనుషులు బాగా తెలిస్తే కానీ మాట్లాడటం ప్రారంభించడు. అతనంతే తప్పుగా అనుకోకు అని పవన్ కళ్యాణ్ చెప్పాడట.



ప్రతిరోజు పవన్ కళ్యాణ్ ఆనంద్ సెట్స్ లో మాట్లాడుకుంటున్న సమయంలో వాసుకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేది. ఈ క్రమంలోనే ఆనంద్ కి వాసుకి కి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఎవరింటికి వాళ్లు వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడుకునేవారు. ఒకానొక రోజు సినిమా సెట్స్ లో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్న సమయంలో ఆనంద్ పెళ్లి చేసుకుందామా అని వాసుకి ని అడిగాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన వాసుకి తనకు కొన్ని రోజుల సమయం కావాలి అని చెప్పిందట. అయితే నేను నీకు ప్రేమ, పెళ్లి ప్రపోజ్ చేసిన తర్వాత నీతో స్నేహితుడిగా ఉండలేను. నువ్వు నా ప్రపోజల్ ఒప్పుకొనేంతవరకు నేను నిన్ను ఇబ్బంది పెట్టను అని వాసుకికి పదిహేను రోజుల పాటు ఆనంద్ ఫోన్ చేయలేదట, మాట్లాడ లేదట. దీంతో అతడిని మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చిన వాసుకి ఫోన్ చేసి అతడితో మాట్లాడింది. ఆ తర్వాత అతడి ప్రేమను, పెళ్లి ప్రపోజల్ ని ఒప్పుకుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ పరిచయం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకొని అన్యోన్యంగా తన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తోంది వాసుకి.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: