బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా ఆ మధ్య కవచం అని ఓ సినిమా వచ్చింది గుర్తుంది కదా.. తెలుగులో పెద్దగా ఆడలేదు. కానీ.. హిందీలోకి డబ్ అయిన ఈ సినిమా యూట్యూబ్ లో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ 200 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.
తెలుగు హీరోల సినిమాలు హిందీలోకి డబ్ అయ్యి యూట్యూబ్‌లో మంచి వ్యూస్ రాబట్టుకోవడం కొంతకాలంగా వస్తున్నదే. ఇప్పటి వరకూ అల్లు అర్జున్ చిత్రం సరైనోడు యూట్యూబ్‌ను కుమ్మేసింది.. ఈ సినిమా ఇప్పటికే 290 మిలియన్ల వ్యూస్ సాధించింది. 300 మిలియన్ల దిశగా దూసుకెళ్తోంది.
ఇక ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కవచం కూడా రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. హిందీ అనువాదంలో ‘ఇన్స్పెక్టర్ విజయ్’ టైటిల్‌తో యూట్యూబ్‌లో విడుదలైంది. 200 మిలియన్ ప్లస్ వ్యూస్ దాటేసింది. అలా టాలీవుడ్లో ఫ్లాప్ అయ్యినా.. హిందీ అనువాదంలో పెద్ద సక్సెస్ సాధించింది.
కవచం అనే కాదు.. ఇటీవల తెలుగు డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ ను కుమ్మేస్తున్నాయి. తెలుగు చిత్రాలను అక్కడ డబ్ చేసి యూట్యూబ్‌లో వదిలితే మిలియన్లలో వ్యూస్ సంపాదించుకుంటున్నాయి. అల్లు అర్జున్, నితిన్, రామ్ వంటి హీరోల చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది.