ప్రస్థుత కాలమాన పరిస్థితులలో ప్రజలకు ఖాళీ ఎక్కువగా దొరుకుతున్న నేపధ్యంలో అందరు టివీ లకు చేతిలోని సెల్ ఫోన్స్ కు ఓటీటీ సినిమాలకు తెగ హత్తుకు పోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు యూత్ ఎక్కువగా సినిమాలకంటే 8డి మ్యూజిక్ మ్యాజిక్ కు హత్తుకు పోవడంతో ఇక రానున్నరోజులలో ఈ 8డి మ్యూజిక్ లో వచ్చే పాటలకు సంగీతానికి విపరీతమైన ప్రాచూర్యం కలిగి ఆ మ్యూజిక్ కంపెనీలకు కాసులు కురిసే అవకాశం ఉంది అంటూ అంచనాలు వస్తున్నాయి.


సాధారణంగా ఎవరైనా ఒక పాటను వింటే అందులోని సంగీతం స్థిరంగా మన చెవులకు తాకుతుంది. కానీ 8డి లో అలా కాదు. కుడి నుంచి ఎడమకు పై నుంచి క్రిందకు తలచుట్టూ ఇలా అన్ని దిశల నుంచి సంగీతం వినిపిస్తున్న అనుభూతి కలుగుతుంది.


ముఖ్యంగా చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఈ 8డి మ్యూజిక్ వినే వారికి ఒక వింత ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. దీనితో ప్రస్తుతం ఈ మ్యూజిక్ వస్తున్న ఆదరణ చూసి అనేక పేరు పొందిన మ్యూజిక్ కంపెనీలు ఇలాంటి మ్యూజిక్ సీడీలను రూపొందించే విషయంలో చాల బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాక ఉర్రూతలూగించిన పాటలను 8డి ఎఫెక్ట్ తో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి విడుదల చేస్తూ మ్యూజిక్ కంపెనీలు అన్నీ కోట్లు గణించడానికి భారీ ప్లాన్ లో ఉన్నాయి.


శివ స్థుతి నుండి సినిమా పాటల వరకు ఇలా ఇప్పుడు అన్నీ 8డి మ్యాజిక్ లో విడుదల అవుతున్న పరిస్థితులలో మన తల చుట్టూ సంగీతం తరంగాలుగా తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతూ ఇప్పటి వరకు చెవులు మాత్రమే విన్న మ్యూజిక్ ను మెదడు వినే మ్యూజిక్ లా మారిపోవడంతో ఈకొత్త ట్రెండ్ కు అనుగుణంగా మ్యూజిక్ కంపెనీలు కూడ మారిపోతున్నాయి. దీనితో మ్యూజిక్ వ్యాపార రంగంలో వస్తున్న ఈసరికొత్త మార్పులకు అనుగుణంగా కంపెనీలు కూడ తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: