తెలుగులో విభిన్న కధాంశాలతో తెరకెక్కే సినిమాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది. ఆ సినిమాలు క్లాసిక్స్ గా మిగిలిపోతాయి. కంటెంట్ ఏదైనా డీసెంట్ ఫిల్మ్ గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. అటువంటి లిస్టులోకి వచ్చే సినిమా ‘సొగసు చూడతరమా’. నరేశ్, ఇంద్రజ జంటగా తెరకెక్కిన ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. డిఫరెంట్ జోనర్లో వచ్చిన ఈ సినిమా విడుదలై నేటితో 25ఏళ్లు పూర్తయ్యాయి. వెర్సటైల్ డైరక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1995 జూలై 14న విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది.

IHG

 

కథ పరంగా ఈ సినిమా ఇద్దరు భార్యా భర్తల మధ్య నడుస్తుంది. సున్నితమైన అంశాన్ని చాలా ఫ్రెష్ స్క్రీన్ ప్లే, టేకింగ్ తో గుణశేఖర్ అద్భుతమైన సినిమాగా మలిచాడు. గుణశేఖర్ కెరీర్లో దర్శకుడిగా ఇది ఆయనకు రెండో సినిమా మాత్రమే. కానీ.. కొత్త కథ, కథనంతో మాయాజాలం చేశాడు. భార్యను మోడ్రన్ అమ్మాయిగా మలచాలనుకుని సంప్రదాయం కంటే ఉత్తమమైంది లేదని తెలుసుకునే భర్త పాత్రలో నరేశ్ నటించాడు. అణకువ, అందం కలగలిపిన పాత్రలో ఇంద్రజ నటించింది. సినిమాకు ప్రధాన బలం కథ, స్క్రీన్ ప్లే మాత్రమే. రమణి భరద్వాజ్ సంగీతంలోని పాటలన్నీ హిట్ అయ్యాయి.

IHG

 

అంతే అందంగా చిత్రీకరించి సినిమా హిట్ లో భాగమయ్యేలా చేశాడు గుణశేఖర్. వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల మెప్పుతోపాటు విమర్శకుల ప్రశంసలు.. ప్రభుత్వ నంది అవార్డులు వరించాయి. ‘ఉత్తమ చిత్రం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కాస్ట్యూమ్స్’ విభాగాల్లో నాలుగు నందులు దక్కాయి. గుణశేఖర్ సొంత ప్రొడక్షన్ లో తండ్రి, అన్నయ్య కలిసి ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా ద్వారా గుణశేఖర్ రూపంలో ఇండస్ట్రీకి మంచి దర్శకుడు లభించాడని తర్వాత చాలా సినిమాలు నిరూపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: