నిత్యామీనన్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే మరికాస్త పొడవు ఉండి ఉంటే ఆమె ఎప్పుడో టాప్ హీరోయిన్స్ లిస్టు లో ఉండి ఉండేది అని స్వయంగా బాలకృష్ణ ఒక ఓపెన్ ఫంక్షన్ లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే నిర్మాతలు ఎంత పారితోషికం ఇచ్చినా ఎక్స్ పోజింగ్ విషయంలో లిప్ లాక్ ల విషయంలో నిత్యామీనన్ కు అనేక అభ్యంతరాలు ఉన్నాయి. అందువల్లనే ఆమె సమర్థతకు తగ్గ అవకాశాలు రాలేదు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.  


ప్రస్తుత పరిస్థితులలో నిత్యామీనన్ కూడ మారిపోయిందా అనే ఆసక్తికర చర్చలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. దీనికికారణం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతున్న ఒక వెబ్ సిరీస్. నిత్యామీనన్ అభిషేక్ బ‌చ్చ‌న్ కలిసి నటిస్తున్న ‘బ్రీత్: ఇంటూ ది షాడోస్’ వెబ్ సీరిస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


ఇప్పటికే పాపులర్ అయిన ఈవేబ్ సిరీస్ లో నిత్యామీన‌న్ లిప్ కిస్ సీన్లో రెచ్చిపోవ‌డంతో ఈ వెబ్  సీరిస్ కు విపరీతమైన ప్రచారం వస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో నిత్యామీనన్ లిప్ లాక్ చేసింది హీరోతో కాదు. అది లెస్బియ‌న్ కిస్ కావ‌డం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. దీనితో నిత్యామీనన్ తన కట్టుబాట్లు అన్నీ పక్కకు పెట్టి ఇలా లెస్బియ‌న్ త‌ర‌హా లిప్ లాక్ సీన్ లో ఎందుకు కనిపించింది అన్న విషయం చాలామందికి అర్ధం కాని విషయంగా మారింది.


ప్రస్తుతం నిత్య కు చేతిలో ఉన్న సినిమాలు చాల తక్కువగా ఉన్నాయి. క్రేజీ హీరోయిన్స్ తో పోటీ పెరిగిపోవడంతో ఆమెకు సమర్థత ఉన్నా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు చాల తక్కువగా ఉన్నారు. దీనితో ఇలాంటి భారీ వెబ్ సిరీస్ లో ఒక లిప్ లాక్ సీన్ లో కనిపిస్తే బాలీవుడ్ దృష్టిని ఆకర్షించ వచ్చని నిత్య అభిప్రాయం అయి ఉంటుందని కొందరి అభిప్రాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: