ఇప్పుడు టాలీవుడ్ లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప పై చాలానే చర్చలు జరుగుతూ ఉన్నాయి అనే చెప్పాలి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని జనాలు చాలా వరకు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ పాత్ర ఏ  విధంగా ఉంటుంది అనే ఆసక్తి జనాల్లో చాలా వరకు ఉంది అనే చెప్పాలి. ఇప్పటికే ఫస్ట్ లుక్ రాగా అది ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే జనాలు అసలు మిస్ కాకుండా చదువుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

 

ఇక ఈ సినిమాను ఇప్పుడు ఎక్కడ షూట్ చెయ్యాలి అనే దాని మీద అసలు ఒక నిర్ణయం తీసుకోలేని విధంగా ఉన్నాడు దర్శకుడు సుకుమార్ అని టాలీవుడ్ లో టాక్ మరి. ఎందుకు అంటే ఎక్కడ చూసినా సరే కరోనా కేసులు ఎక్కువగా ఉండటం తో సుకుమార్ కాస్త సినిమా షూట్ విషయంలో ఆలోచనలో పడ్డాడు. అయితే ఈ సినిమాను ఇప్పుడు కోయంబత్తూరు ఆడవాల్లో షూట్ చేయడానికి రెడీ అయ్యాడు  అని సమాచారం. ఈ సినిమా షూట్  అక్కడ చేయడానికి గానూ అతను ఇప్పుడు నిర్మాతతో చర్చిస్తున్నాడు అని అంటున్నారు. 

 

ఈ సినిమాను వచ్చే ఏడాది ఎలా అయినా సరే తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. కాని ఎప్పుడు వస్తుందా అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది మరి. ఇక ఈ సినిమాలో నటించే వారి విషయంలో కూడా ఇప్పుడు చాలా వరకు అంగీకారానికి రావడం లేదు. ప్రకాష్ రాజ్ ని కూడా ఈ సినిమాలో తీసుకునే అవకాశం ఉంది అనే వార్తలు టాలీవుడ్ లో వస్తున్నాయి గాని నిజామా కాదా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: