టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే రామ్ గోపాల్ వర్మ విషయంలో ఎప్పుడు కూడా ఏదోక వివాదం నడుస్తూనే ఉంటుంది. అతను మెగా ఫ్యామిలీ విషయంలో అనుసరించే వైఖరి చాలా వారకు వివాదాస్పదంగా ఉంటుంది. అతను ఏది చేసినా సరే ఒక సంచలనం అనే విషయం దాదాపుగా చెప్పవచ్చు. అగ్ర హీరోల సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు వివాదాలతో ఉన్న సినిమాలను ఎక్కువగా చేస్తున్నారు అనే విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు అతను పవర్ స్టార్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి చేస్తున్నారు. 

 

సినిమా విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన భార్య కూడా ఇప్పుడు ఆగ్రహంగానే ఉన్నారు అని టాక్. ఈ నేపధ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజోనోవా. ఆమె ఈ సినిమా మీద కేసు పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక లుక్ బయటకు వచ్చింది. ఆ లుక్ తనను అవమానించే విధంగా ఉంది అని ఆమె భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే వర్మ మీద కేసు నమోదు చేయించాలి అని పవన్ తో ఆమె చర్చిస్తున్నారు. 

 

అంతే కాదు ఈ సినిమా తన భర్త మనోభావాలను కూడా దెబ్బ తీసే విధంగా ఉంది అని ఆమె అసహనంగా ఉన్నారు అని టాక్. ఈ సినిమాకు సంబంధించి వర్మ గనుక వెనక్కు తగ్గలేదు అంటే మాత్రం కచ్చితంగా ఇప్పుడు ఆమె కేసు పెట్టాలి అని ఈ విషయంలో ఆమె సీరియస్ గా ఉన్నారు అని టాక్. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా స్పష్టత లేదు గాని వివాదం నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: