బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆ మద్య నటించిన హౌస్​ఫుల్​-4 చిత్రంలోని ‘బాల’ అనే పాటకు చిందులు వేశారు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూతుళ్లు.  గత కొంత కాలంగా తన డ్యాన్స్​లు, సరదా వీడియోలతో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉంటే.. ఈ ఫ్యామిలీ మాత్రం అందరికీ మంచి ఎంట్రటైన్ మెంట్ ఇస్తూ వచ్చింది. తెలుగు, హిందీ పాటలకు భార్య, కూతుళ్లతో కలిసి డ్యాన్స్​లు చేసి భారత అభిమానులను అలరించాడు.  తాజాగా వార్నర్  కూతుళ్లు ఇడి రే, ఇవీ… తండ్రి లేకుండానే సొంతంగా ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు.

 

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హౌస్​ఫుల్​-4 చిత్రంలోని ‘బాల’ అనే పాటకు చిందులేశారు.  ఈ పాటపై ఆ చిన్నారుల డ్యాన్స్ చూస్తుంటే.. ఎంతో ముచ్చల వేస్తుంది. ముఖ్యంగా చిన్న కూతురు గంతులు భలే అనిపిస్తుంది. ఈ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసిన వార్నర్​.. “కూతుళ్లు సొంతంగా డ్యాన్స్ చేయాలనుకున్నప్పుడు” అంటూ రాసుకొచ్చాడు.  కాగా వార్నర్ గతంలోనే ఈ పాటకు డ్యాన్స్ చేయగా… అభిమానులు లైక్​లు, కామెంట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు మళ్లీ అతడి కూతుళ్లు ఇదే సాంగ్​కు ఎంతో చూడముచ్చటగా స్టెప్పులు వేశారు.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

When your daughters want to do their own bala dance 🤷🏼‍♂️🤷🏼‍♂️😂😂 #bala #dance #family

A post shared by David Warner (@davidwarner31) on

మరింత సమాచారం తెలుసుకోండి: