సౌత్ ఇండియన్ ఫిమేల్ సూపర్ స్టార్ ఎవరంటే ఠక్కున స్ఫురణకు వచ్చే పేరు ‘నయనతార’. సినిమాల్లోకి వచ్చి 15ఏళ్లు అవుతున్నా నయనతార క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. తమిళ్ లో ఏకంగా స్టార్ హీరోలకు ధీటుగా అభిమానులు ఆమెకు కటౌట్లు కడుతూ తమ అభిమానం చూపిస్తూ ఉంటారు. ఎంత స్టార్ స్టేటస్ ఉన్నా నయనతారపై కొన్ని విమర్శలు మాత్రం ఉండిపోయాయి. ముఖ్యంగా తాను నటించే సినిమాల ప్రమోషన్లకు హాజరు కాదనే అపవాదు ఉంది. ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె మాత్రం తన అనుకున్న మాట మీదే ఉంది. దీనిపై ఆమె హిందీ వెబ్ కు స్పందించింది.

IHG

 

‘నేను ప్రైవేట్ లైఫ్ కోరుకుంటాను. నా గురించి ప్రపంచానికి తెలియాలని కోరుకోను. నేను విపరీతమైన జనసందోహం ఉన్న చోట ఉండలేను. అందుకే సినిమా ప్రమోషన్లకు హాజరుకాను. వ్యక్తిగతంగా నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చేసే పని చేస్తాను. నా గురించి నా సినిమాలే మాట్లాడతాయి. ఇందుకు నాపై అనేక విమర్శలు వచ్చాయి. నా గురించి తప్పుగా రాశారు. అయినా.. నేను నా పని నాదే. అందుకే మీడియాకు కూడా దూరంగా ఉంటాను’ అని చెప్పుకొచ్చింది. సినిమా అవార్డ్ ఫంక్షన్లకు తప్ప మెగాస్టార్, సూపర్ స్టార్ సినిమాల ప్రమోషన్లకు కూడా ఎప్పుడూ హాజరు కాలేదు నయన్.

IHG

 

సినిమా ప్రమోషన్లకు ప్రత్యేకంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని.. షూటింగ్ సమయంలో స్టాఫ్ ఖర్చులన్నీ నిర్మాతలపైనే వేస్తుందని.. ఆమెకు ఫైవ్ స్టార్ హోటల్ మెయింటనెన్స్ ఇవ్వాలనే వాదనలు ఉన్నాయి. కానీ.. ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెపై అవేమీ నిలబడలేదు. కరోనా సమయంలో ఫెఫ్సీకి 20లక్షల విరాళం ఇచ్చి విమర్శలకు చెక్ పెట్టింది. ఏ సౌత్ ఇండియన్ హీరోయిన్ కూడా ఈ స్థాయిలో విరాళం ఇవ్వలేదు. దీంతో నయనతారపై వచ్చే విమర్శలన్నింటికీ చెక్ పడ్డాయి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: