పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ లెవల్స్ కు వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ ఓ ఉదాహరణ. ఇక ట్రైలర్ వ్యూస్, ఓపెనింగ్ డే కలెక్షన్ల రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలా పవన్ క్రియేట్ చేసిన రికార్డుల్లో ‘అత్తారింటికి దారేది’ ట్రైలర్ కూడా ఉంది. త్రివిక్రమ్ డైరక్షన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూలై 13న పవన్ లుక్ తో రిలీజైన మోషన్ ట్రైలర్ తోనే ఫ్యాన్స్ ఊగిపోయారు. ఆ సమయంలో 2013 జూలై 16న విడుదలైన అత్తారింటికి దారేది ట్రైలర్.. అప్పట్లో పెను ప్రభంజనమే సృష్టించింది.

IHG

 

పవన్ లుక్స్, స్టైల్, ఫైట్స్, పాటలు, కామెడీ.. అంశాలతో కట్ చేసిన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఏడేళ్ల క్రితం యూట్యూబ్, సోషల్ మీడియా ఉన్నా ఇప్పుడున్నంత విస్తృతంగా లేదు. ఆ సమయంలో ఈ ట్రైలర్ కు భారీ స్పందన వచ్చింది. ఏకంగా మొదటి రోజే 3లక్షల వ్యూస్ తో 9వేల లైక్స్ వచ్చాయి. అప్పటికి ఇదే అత్యధిక రికార్డు. మరునాటికి మొత్తంగా 7లక్షల వ్యూస్ 15వేల లైక్స్ వచ్చాయి. పవన్ క్రేజ్ కు ఈ సినిమా ట్రైలర్ రికార్డులు కొలమానంగా నిలిచాయి. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఈ సినిమా రిలీజ్ కష్టంగా మారింది.

IHG's Attarintiki Daredi <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AUDIO' target='_blank' title='audio-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>audio</a> Release: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=EVENT' target='_blank' title='events-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>events</a> in ...

 

ఆ సమయంలో సెప్టెంబర్ 24న సినిమా ఫస్ట్ హాఫ్ డైరక్ట్ గా ఎడిటింగ్ ఆఫిస్ నుంచే లీక్ అయిపోయి క్షణాల్లో అందరి మొబైల్స్ లోకి వచ్చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో సెప్టెంబర్ 27నే సినిమా విడుదల చేశారు. మొదటి షో నుంచే బ్రహ్మాండమైన టాక్ తెచ్చుకుని అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఇంతగా లీక్ అయిన సినిమా కూడా ఆస్థాయిలో హిట్ అవడం ఓ చరిత్రగా నిలిచిపోయింది.

IHG's Attarintiki Daredi First Look Posters

మరింత సమాచారం తెలుసుకోండి: