సూపర్ స్టార్ రజనీకాంత్ పై బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ దీపికా పదుకోని చేసిన కామెంట్స్ కోలీవుడ్ మీడియాకు షాకింగ్ గా మారాయి. మొన్నటిదాకా రజినీకాంత్ తో జంటగా నటించడం తనకు లభించిన అదృష్టం అని చెప్పుకు వచ్చిన దీపికా ఇప్పుడు రజినీ పేరు చెపితేనే కోపంగా ఉందట. అంతేకాదు తనకు దక్షిణాది సినిమాలంటేనే చికాకు పుడుతోందని సెటైర్లు కూడ వేస్తోందట. దీనికి కారణం 'కొచ్చాడయన్' లో తన పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేదని గగ్గోలు పెడుతోంది దీపిక. అందువలన కోపంతో ఆమె అలిగి రజినీకాంత్ సినిమా ప్రమోషన్ ఏక్టివిటీస్ కు కూడ హాజరు కాకుండా డుమ్మా కొట్టిందట. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాను అని అనుకుంటే ‘కొచ్చాడియన్’ ఇలా తాయారు ఆయిందేమిటి అని బెంగ పెట్టుకుందట దీపిక. ఈ సినిమా ఫ్లాపు అవటం కూడా ఆమెను నిరాశలో ముంచింది అంటున్నారు. తాను ఈ మధ్య వరుసగా నటించిన సినిమాలు 'కాక్‌టైల్', 'రేస్ 2', 'యే జవానీ హై దీవానీ', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' ‘రామ్ లీలా’ వరుసపెట్టి కోట్లు కురిపిస్తే రజినీ సినిమా తనకు మొట్టమొదటి పరాజయాన్ని చూపెట్టిందని సెంటిమెంట్ గా దీపిక ఫీల్ అవుతోందని టాక్. దీనిని బట్టి చూస్తూ ఉంటే ‘కొచ్చాడియన్’ విషయంలో రజినీ కన్నా దీపిక ఎక్కువగా షాక్ అయింది అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: