విలక్షణ నటుడు కమలహాసన్ కు ఎన్ని వైవిధ్యమైన కళలలో ప్రావిణ్యం ఉందో అతడి కూతురు శ్రుతిహాసన్ కు కూడా సినిమా రంగానికి సంబంధించి వివిధ కళలలో ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం షూటింగ్ లలో బిజీగా ఉంటున్న ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఈమధ్య చెన్నై వీధులలో అర్ధ రాత్రి మోటార్ బైక్ పై హెల్మెట్లు పెట్టుకుని చేసిన హంగామా ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.  ఈమధ్య శ్రుతి తన తండ్రిని కలుద్దామని చెన్నై వెళ్ళి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తన తండ్రిని ఆశ్చర్య పరుద్దామని కమల్ ఇంటికి వెళ్లిందట. అయితే ఆమె వెళ్ళిన సమయానికి కమల్ ఇంటి వద్ద లేక పోవడంతో నిరాశకు గురైన శ్రుతి కమల్ కు ఫోన్ చేస్తే తాను ఆళ్వార్ పేటలోని తన ఆఫీసులో ఉన్నానని అక్కడకు రమ్మని శ్రుతితో చెప్పాడట కమల్.  తన తండ్రి ఆఫీసుకు వెళ్ళిన శ్రుతిని చూడగానే కమల్ గట్టిగా కౌగలించుకుని తన కూతురుని ఎత్తుకున్నంత పని చేసాడట. ఆ తరువాత చాలాసేపు మాట్లాడుకున్న ఆ తండ్రి, కూతుళ్ళు అర్దరాత్రి దాటిపోయినా బయటకు వెళదామా అని కమల్ అడిగే సరికి తన తండ్రి కారు బయటకు తీస్తాడు అనుకున్నదట శ్రుతి.  అయితే శ్రుతికి షాక్ ఇస్తూ కమల్ రెండు హెల్మెట్లు తీసుకు వచ్చి కమల్ తన మోటార్ బైక్ పై శ్రుతిని ఎక్కించుకుని దాదాపు 2 గంటల పాటు చెన్నై రోడ్లన్నీ తిరుగుతూ తనకు నచ్చిన ఫుడ్ అంతా కొనిపెట్టిన తన తండ్రి కళ్ళల్లో ఆనందం మధ్య కన్నీళ్లు చూసి కరిగిపోయాను అంటోంది శ్రుతి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: