మిల్కీ బ్యూటీ తమన్నా కృష్ణ వంశీ దిల్ రాజ్ ల పై వేసిన సెటైర్లు ఇప్పుడు ఫిలింనగర్ కు హాట్ టాపిక్ గా మారాయి. కృష్ణ వంశీ దర్శకత్వం వహించబోతున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకు తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేసుకుందామని ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజ్ తో కలిపి తమన్నాను కలిసినప్పుడు ఆమె మాట్లాడిన తీరు కృష్ణ వంశీకి మైండ్ బ్లాంక్ చేసిందని టాక్.  నటనకు అత్యంత ఆస్కారం ఉన్న ఈ పాత్రలో నటించడానికి తమన్నా మొదట్లో ఒప్పుకున్నట్లు కనిపించినా చివరికి ఈ సినిమాకు సంబంధించి పారితోషికం విషయంలో ఆమె వినిపించిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి ఈ సినిమా బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని తమన్నా పారితోషికాన్ని తగ్గించుకోమని కోరిన దిల్ రాజ్, కృష్ణవంశీల మాటలకు తమన్నా ప్రతిస్పందిస్తూ మంచిసినిమా అయినా మసాలా సినిమా అయినా తనకు ఒకే విధమైన పారితోషికం ఇవ్వాలని అంటూ కోటి డిమాండ్ చేసిందని టాక్.  అంతేకాదు ఏ మాత్రం క్రేజ్ లేని అంజలి లాంటి హీరోయిన్స్ కు కోటి రూపాయలు ఇస్తున్న టాలీవుడ్ నిర్మాతలు ఇంత క్రేజ్ ఉన్న తనకు కోటి ఇవ్వడంలో ఎందుకు ఆలోచిస్తున్నారు అంటూ ఆమె దిల్ రాజ్ కృష్ణవంశీలకు ఎదురు ప్రశ్న వేసేసరికి వారిద్దరి నోటి వెంట మాటలు రాక మౌనం వహించారని వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: