టాలీవుడ్ ప్రినన్స్ మహేష్ బాబు ఈమధ్య కొత్త సంవత్సరo సరదాల కోసం దుబాయ్ వెళ్ళి వచ్చిన తరువాత మహేష్ తీరులో మార్పు వచ్చింది అంటూ సెటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుంది అని ప్రచారం జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో తన కొత్త సంవత్సరం సరదాల తరువాత మహేష్ మళ్ళీ ఈ షూటింగ్ కు జాయిన్ అయ్యాడు.  రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా టైటిల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ సాంగ్ కు ప్రముఖ కొరియో గ్రాఫర్ రాజు సుందరం డాన్స్ డైరెక్షన్ చేస్తున్నాడు. అయితే ఈపాట కోసం మహేష్ ఇప్పటి వరకు ఎప్పుడూ వేయని కొత్త స్టెప్స్ తో ఈపాటలో నటిస్తూ ఈ సినిమా యూనిట్ ను ఆశ్చర్య పరుస్తున్నాడట.  డాన్స్ విషయంలో పెద్దగా శ్రద్ద పట్టని మహేష్ ఈ పాటలో రాజు సుందరం చేత వెరైటీ స్టెప్స్ డిజైన్ చేయించి చాల కష్టపడి ప్రాక్టీస్ చేసి సునాయాసంగా ఈ టైటిల్ సాంగ్ లో వేస్తున్న మహేష్ డాన్స్ మూమెంట్స్ ను చూసి కొరియోగ్రాఫర్ రాజు సుందరం మహేష్ బాబు దుబాయ్ లో ఏ మందు తీసుకున్నాడు ఇలా రెచ్చి పోతున్నాడు అంటూ మహేష్ పై ప్రశంసలతో కూడిన సెటైర్లు వేస్తున్నాడట ఈ కొరియోగ్రాఫర్.  గత సంవత్సరం వరస పెట్టి వచ్చిన పరాజయాలతో మహేష్ తన స్టెప్స్ విషయంలోనే కాదు తన కొత్త సినిమాల ఎంపిక విషయంలో కూడా విపరీతమైన స్పీడ్ పెంచాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: