ఈ సంవత్సరం ఏప్రియల్ 17న విడుదలవుతుంది అని ఇప్పటికే తన రిలీజ్ డేట్ ను ప్రకటించుకున్న ‘బాహుబలి’ సినిమాను అనుకోని విధంగా బాలయ్యా, బన్నీలు కార్నర్ చేయబోతు ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు నిర్మించని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాణం అవుతున్న ఈసినిమా విడుదలకు ముందు ఏ సినిమా విడుదల కాదు అని అనుకున్నారు అంతా.

కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అల్లుఅర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ అవుతోందని సమాచారం. అదే విధంగా తన ‘లెజెండ్’ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ బాలకృష్ణ నటించిన ‘లయన్’ మార్చి 28న విడుదల కాబోతోంది అనే వార్తలు ఇప్పటికే వచ్చాయి.

దీనినిబట్టి చూస్తూ ఉంటే రాజమౌళి ‘బాహుబలి’ విడుదలకు కేవలం 15 రోజులు ముందుగానే బాలకృష్ణ, బన్నీల సినిమాలు విడుదలై ధియేటర్లలో తిష్టవేసుకుని కూర్చుని ఉంటాయి అని అర్ధం అవుతోంది. ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా విడుదల కౌంట్ డౌన్ మొదలయ్యాక 15 రోజుల ముందే రకరకాల సెంటిమెంట్లతో అనుకోకుండా ‘బాహుబలి’ ని టార్గెట్ చేస్తూ ఈ టాప్ హీరోలు ఇద్దరూ వేసవి రేసులో నిలబడటం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

వస్తున్న వార్తలను బట్టి కేవలం 20 రోజుల వ్యవధిలో టాలీవుడ్ ప్రేక్షకుల పై మూడు భారీ సినిమాలు దాడి చేయడం కలక్షన్స్ విషయంలో ఎలా ఉన్నా ఈ మూడు సినిమాలను అత్యంత భారీ మొత్తాలకు కొనుకున్న బయ్యర్లకు రాబోతున్న సమ్మర్ సీజన్ పరీక్ష కాలంగా మారనున్నది..

మరింత సమాచారం తెలుసుకోండి: