‘పోకిరి’ సినిమాతో మాస్ హీరోగా మారిపోయిన మహేష్ తన సినిమాలలోని యాక్షన్ సన్నివేసాల చిత్రీకరణలో చాల శ్రద్ధ పెట్టడమే కాకుండా తాను నటించే ప్రతి ఒక్క సినిమాకు ఒక వైవిద్యాన్ని చూపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పోరాట సన్నివేశాలలో మహేష్ చూపించే ఎనర్జీ చాల స్పెషల్ గా ఉంటుంది కాబట్టే యూత్ లో మహేష్ కు అంత  క్రేజ్ ఉంది.

ఈ ఫైట్ సీన్స్ రొటీన్ 


ఇక లేటెస్ట్ గా మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ అనల్ అరుసు డిజైన్ చేసిన ఫైట్లలో మహేష్ నటిస్తున్నాడు. అయితే ఈ ఫైట్ సీన్స్ రొటీన్ సినిమాలలోని ఫైటింగ్ సీన్స్ లా పెద్దపెద్ద బిల్డింగ్స్ ఎక్కి దూకేయడం, స్లమ్ముల్లో పరుగులు పెట్టడం, బైక్ రైడింగ్, రోప్ జంపింగ్ లాంటి రొటీన్ సీన్స్ కాకుండా చాల వెరైటీగా ఉండాలని మహేష్ పట్టుపడుతున్నట్లు టాక్. 

మహేష్ తాను నటిస్తున్న శ్రీమంతుడు



దీనితో ఈ సినిమాకు ఫైట్స్ డిజైన్ చేస్తున్న అనల్ అరుసు చాల ఖంగారు పడిపోతున్నాడట. ఎలాంటి ఫైట్  సీన్స్ డిజైన్ చేసి మహేష్ ని మెప్పించాలో తెలియక తికమక పడుతున్నట్లు టాక్. దీనితో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలలో జరుగుతోందని తెలుస్తోంది. ‘ఆగడు’ పరాజయంతో మహేష్ తాను నటిస్తున్న ‘శ్రీమంతుడు’ విషయంలో ప్రతి చిన్న విషయంలోనూ ఎంత కేర్ తీసుకుంటున్నాడో దీనిని బట్టి అర్ధం అవుతుంది..   
 



మరింత సమాచారం తెలుసుకోండి: