గత కొంత కాలంగా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్న సినిమా లయన్. గత సంవత్సరం బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్’ 400 రోజులు థియేటర్లో ప్రదర్శించి తెలుగు చిత్ర సీమలో రికార్డుల మోత మోగించింది.  ఇదే ఊపు మీద ఉన్న బాలయ్య ‘లయన్’  సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు పెరిగిపోయాయి , లయన్ టీజర్ లో బాలకృష్ణ పవర్ ఫుల్ పంచ్ డైలాగులు అభిమానులను తెగ ఆనంద పర్చాయి. దీనిపై ఎంతో అంచనాలు పెరిగిపోయాయి. అయితే అంచనాలు చేరుకోవడంలో లయన్ కాస్త నిరాశపరిచిందన్న టాక్ వస్తుంది.

లయన్ మూవి పోస్టర్


లయన్ స్టోరీ కాస్త బాగున్నా దర్శకుడు సత్యదేవా స్క్రీన్‌ప్లే విషయంలో ఫెయిల్ కావడంతో లయన్ అంచనాలు అందుకోలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. బాలకృష్ణ రెండు పాత్రలు చేసి తన పాత్రకు తగ్గ పర్ఫామెన్స్ బాగానే ఇచ్చిన ఆయనను సరిగా లీడ్ చేయించలేక పోయారు దర్శకులు. ఎక్కువ థియేటర్లు ఇవ్వడంతో సినిమాకు ఓపెనింగ్స్ భారీగానే ఉన్నాయి. దర్శకుడు సత్యదేవా తొలిసినిమాతో 50 శాతం మాత్రమే సక్సెస్ అయ్యాడు.

బాలకృష్ణ లయన్ మూవీ పోస్టర్ 


బాలయ్య నటన, డ్యాన్సులు, పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్ అయ్యాయన్న టాక్ వస్తోంది.  వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్లు ఉన్నా వారిపై ఎలాంటి అభిప్రాయం చెప్పలేని పరిస్థతిలో ఉంది   ఫస్ట్‌హాప్, హీరో-హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మిస్ కావడం, పాటలు, సాగదీసిన సీన్లు సినిమాకు మైనస్ అయ్యాయి. ఓవరాల్‌గా బీ, సీ సెంటర్లలో కలెక్షన్లు  వసూల్ చేసే సినిమాగా లయన్ నిలవనుంది.  మాస్ పీపుల్స్ కి నందమూరి అభిమానులకు సినిమా మంచి కిక్ ఇస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: