ప్రభాస్ అభిమానులే కాదు తెలుగు సినిమా ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజమౌళి సుందర స్వప్నం ‘బాహుబలి’ పై ప్రభాస్ ఒక బుల్లితెర ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ‘ఛత్రపతి’ సినిమా తరువాత ప్రభాస్ రాజమౌళిల కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ సినిమాకోసం ప్రభాస్ గత రెండేళ్లుగా కష్టపడటమే కాకుండా ఈ సినిమా కోసం తన పెళ్లిని కూడ వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.


కె. రాఘవేంద్రరావు నిర్వహిస్తున్న ‘సౌందర్య లహరి’


అటువంటి ప్రభాస్ కె. రాఘవేంద్రరావు నిర్వహిస్తున్న ‘సౌందర్య లహరి’ కార్యక్రమంలో ఈ సినిమా దర్శకుడు రాజమౌళితో కలిసి పాల్గొని ‘బాహుబలి’ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఈ కార్యక్రమ యాంకర్ ప్రభాస్ తో మాట్లడుతూ ‘బాహుబలి’ సినిమా పై మీ అంచనాలు ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ప్రభాస్ నవ్వుతూ వెరైటీగా కామెంట్ చేసాడు. 


‘బాహుబలి’ విషయమై ప్రభాస్ ఇటువంటి షాకింగ్ కామెంట్స్ చేయడం


షూటింగ్ పూర్తి అయిన ‘బాహుబలి’ తాను పూర్తిగా చూశానని ఈ సినిమాలోని ఇంటర్వెల్ ట్విస్ట్ కంటే తనకు రాజమౌళి జూనియర్ తో దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ తనకు నచ్చింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అయితే రిలీజ్ కు దగ్గర పడుతున్న ‘బాహుబలి’ విషయమై ప్రభాస్ ఇటువంటి షాకింగ్ కామెంట్స్ చేయడం వెనుక ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది అని కూడ అంటున్నారు. 



ఇప్పటికే ‘బాహుబలి’ లోని ఇంటర్వెల్ ట్విస్ట్ అత్యద్భుతంగా ఉంటుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈసినిమా పై రోజురోజుకు పెరిగి పోతున్న అంచనాలను తగ్గించడానికి ప్రభాస్ వ్యూహాత్మకంగా ఈ కామెంట్స్ చేసాడు అనుకోవాలి. రాజమౌళి ఎదురుగా ప్రభాస్ ఈ కామెంట్స్ చేసాడు అంటే ఈ కామెంట్స్ వెనుక ఎదో ఒక అర్ధం ఉండి తీరుతుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: