ఈరోజు ఉదయం ఆంధ్రుల గత ఘన చరిత్రకు దర్పణమైన ఒకనాటి అమరావతిని మించి అదే పేరుతో ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని నిర్మించడానికి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో మందడం గ్రామంలో చంద్రబాబునాయుడు ఆద్వర్యంలో అత్యంత ఘనంగా భూమి పూజ జరిగింది.

అయితే ఈ కార్యక్రమం ఒకవైపు ఘనంగా జరుగుతూ ఉండగానే అక్కడ కూడ పవన్ కళ్యాణ్ ప్రస్తావనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ర్ట మంత్రులు, టీడీపీ నేతలు హాజరైన నేపధ్యంలో ఏపీలో టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి కీలకమైన శక్తిగా పనిచేసిన ‘జనసేన’ అధినేత పవన్‌ కళ్యాణ్ ఎక్కడా కనిపించడే అంటూ కొందరు కామెంట్ చేసినట్లు టాక్.  

ఈ విషయంలో పవన్‌కి ఆహ్వానం అందిందా? ఆయనకు ఆహ్వానం పంపకుండానే ఈ భూమి పూజను నిర్వహించారా అంటూ కొందరు పెద్దలు కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ మహారాష్ర్టలో జరుగుతున్న ‘గబ్బర్‌సింగ్-2’ షూటింగ్‌లో పవన్‌ బిజీగా ఉండటంతో పవన్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని మరికొందరు వాదించినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కు నిజంగా ఆహ్వానం అంది ఉంటే కనీసం తన ట్విటర్ లో అయినా స్పందించి ఉండేవాడు కదా అంటూ మరి కొందరు కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు ఇలా ఉండగా ఈరోజు ఉదయం ఒకవైపు రాజధాని నిర్మాణం కోసం భూమి పూజ జరుగుతూ ఉంటే యువకులు పవన్ ‘జనసేన’ పార్టీ జెండాలు ఫ్లక్సీలు పుచ్చుకుని విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ నినాదాలు చేసారని వార్తలు రావడం బట్టి ఈ వ్యవహారం అనుకోకుండా జరిగిందా లేదా ఏదైనా ఒక వ్యుహత్మకమైన  ఎత్తుగడతో ఎవరైనా వెనుక ఉండి జరిపించారా అన్న విషయమై రకరకాల విశ్లేషణలు వినపడుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: