“బాహుబలి” సినిమా తరువాత ప్రభాస్‌ రేంజ్‌ ఏ స్థాయికి పెరిగి పోతుంది అంటూ అప్పుడే మీడియా లెక్కలు వేస్తోంది. ఇప్పటి వరకు 40 కోట్ల స్థాయిలో ఉన్న ప్రభాస్ రేంజ్ ‘బాహుబలి’ విడుదల తరువాత ఖచ్చితంగా 60 కోట్ల స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ మీడియాకు అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రభాస్ పై అనేక మంది బాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి పడటంతో ప్రభాస్ కు బాలీవుడ్ లో కూడ మంచి మార్కెట్ ఏర్పడుతోంది. 

అయితే ప్రభాస్ తన తదుపరి చిత్రాల విషయంలో ఎటువంటి ఖంగారు పడకుండా చాల వ్యూహాత్మకంగా అడుగులు వేయడానికి నిశ్చయించుకుని ‘బాహుబలి’ ఫలితం గురించి వేచి చూస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఒక ప్రముఖ బాలీవుడ్ సినిమా రంగ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తనలోని ఒక కోరికను బయట పెట్టాడు. 

ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఏ హీరోయిన్‌ అయినా ప్రభాస్ పక్కన నటించాలని కోరుకుంటుంది. అయితే ఆ ఇంటర్వ్యూను చేస్తున్న ఆ మీడియా సంస్థ ప్రతినిది మీరు హిందీ సినిమాలలో నటిస్తే ఏ బాలీవుడ్ బ్యూటీ పక్కన నటిస్తారు అని అడిగిన ప్రశ్నకు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనకు నచ్చిన హీరోయిన్ దీపిక పదుకొనే అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా తనకు ఆమెతో నటించాలని ఉంది అన్న కోరికను వ్యక్తపరిచాడు.

అంతేకాదు నటిగా ఆమె ఎటువంటి పాత్రనైనా నటించి మెప్పించగల సామర్ధ్యం ఆమెకు ఉంది అంటూ దీపికను ఆకాశానికి ఎత్తేశాడు ప్రభాస్. అయితే బాలీవుడ్ హీరోయిన్స్ అంతా ప్రిన్స్ మహేష్ బాబుతో నటించాలని కోరుకుంటూ ఉంటే ప్రభాస్ దృష్టి బాలీవుడ్ హీరోయిన్ వైపు మళ్లడం దక్షిణాది హీరోయిన్స్ కు షాకింగ్ న్యూస్ అనుకోవాలి. ఈ వార్తలు ఇలా ఉండగా అనేక మల్టీ నేషనల్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించామని ప్రభాస్ కు కోట్లను ఆఫర్ చేస్తూ ఉంటే వారికి కూడ ‘బాహుబలి’ విడుదల తరువాత ఆలోచిస్తాను అని ప్రభాస్ చెప్పడం బట్టి ‘బాహుబలి’ పై ప్రభాస్ ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో అర్ధం అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: