తెలుగు, తమిళ రంగంలో కమల్ హాసన్ ఓ ప్రత్యేక నటనా శైలికలిగిన వ్యక్తిగా ఎన్నో అవార్టులు సొంతం చేసుకున్న వ్యక్తిగా విశ్వనటుడిగా అందరికీ సుపరిచితమే.. ఈయన నటనలో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో వివాదాల్లో అంతకంటే ఎక్కువే..? ఇప్పటికి ఇద్దరు భార్యలకు బ్రేకప్ చెప్పి నటి గౌతమితో సహజీవనం చేస్తున్నారు. తాజాగా ఈయన మొదటి భార్య వాణి గణపతి కమల్ పై కారాలు మిర్యాలు నూరుతుందట..!! దీనికి కారణం కమల్ హాసన్ అని తెలుస్తుంది. ఈ మద్య కమల్ హాసన్ ఓ సమావేశంలో నా మొదటి భార్య వాణితో విడిపోయిన సమయంలో నా సర్వస్వం కోల్పోయినట్లు చెప్పారు.

కమల్ హాసన్ మొటి భార్య వాణి గణపతి... వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్


తర్వాత ఈ విషయం తెలుసుకున్న వాణి గణపతి అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. అసలు నాకు విడాకులు ఇచ్చే సమయంలో కమల్ హాసన్ కి ఏమీ లేదని పైగా ఆయన కుటుంబం కూడా పీకల్లోతుల్లో కష్టాల్లో ఉందని అప్పుడు నేనే వారికి సహాయం చేశానని చెప్పింది. అంతే కాదు కమల్ హాసన్ తో కాపురం ఓ అద్దెంట్లీ చేశామని అటువంటిది ఆయన బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం నాకే ఇచ్చనట్లు ప్రగల్భాలు పలకడం దేనికి అని మండిపడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: