తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ‘బాహుబలి’ ధియేటర్ల వద్ద విడుదల కాకుండానే ‘జాతర’ జరుగుతున్న వాతావరణం కనిపిస్తూ ‘బాహుబలి’ ధియేటర్ల వద్ద అభిమానులు వేలాది సంఖ్యలో కనిపిస్తూ హడావిడి చేస్తూ ఉంటే దీనికి భిన్నమైన వాతావరణం ముంబాయి, ఢిల్లీ, కలకత్తా లాంటి ప్రధాన నగరాలలో ‘బాహుబలి’ హిస్టీరియా కనిపించక పోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఈసినిమా హక్కులను ప్రముఖ బాలీవుడ్ సినిమా నిర్మాత కరణ్ జోహార్ పొందటమే కాకుండా ఈ సినిమాను ముంబాయి, ఢిల్లీ నగరాలలో చాల పెద్దఎత్తున ప్రమోట్ చేసాడు. స్వయంగా రాజమౌళి, ప్రభాస్, తమన్నా, అనుష్కలు ఈ సినిమా ప్రమోషన్ లో చాల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమన్నా అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ మీడియాలో చాల పెద్ద హడావిడి చేసింది. అయితే ఈ భారీ ప్రచారం ముంబాయిలో ‘బాహుబలి’ కి పెద్దగా కలిసి వచ్చినట్లు కనిపించడంలేదు ఈ సినిమా ప్రదర్శింపబడే ధియేటర్ల వద్ద ఎద్వాన్స్ బుకుంగ్ కౌంటర్లు రెండు రోజుల క్రితమే ఓపెన్ అయ్యాయి. 

అదేవిధంగా ఈ సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్ కూడ ఓపెన్ అయి రెండు రోజులు గడుస్తున్నా ఇంకా ఆ ధియేటర్ల వద్ద ఉన్న టిక్కెట్లలలో 50 శాతం కూడ బుక్ అవ్వలేదు అన్న వార్తలు కరణ్ జోహార్ కు షాకింగ్ గా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ ఉత్తరాది రాష్ట్రాలలోని అన్ని ప్రధాననగరాలలో భారీగా ధియేటర్లలో విడుదల అవుతున్న నేపధ్యంలో ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్తలు ‘బాహుబలి’ ఓవరాల్ ఓపెనింగ్ కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఉత్తరాది రాష్ట్రాలలో ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంటే ‘బాహుబలి’ టిక్కెట్ల అమ్మకంలో అవకతవకలు జరిగాయి అంటూ కొందరు న్యాయస్థానం మెట్లు ఎక్కి పిల్ దాఖలు చేయడంతో న్యాయస్థానం ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో తన సత్తా చాటుదామనుకున్న రాజమౌళికి ముంబాయికి సంబంధించి వస్తున్న వార్తలు షాకింగ్ న్యూస్ అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: